Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు..

* నేటి రాత్రికి లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్న చంద్రబాబు.. వ్యక్తిగత పర్యటన తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్ట్ ఫెలోఫిస్ అవార్డ్-2025కు ఎంపికైనా భువనేశ్వరి..

* నేడు పార్వతీపురం జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన.. సీతంపేటలో మన్యం అందాలను తిలకిద్దాంరండి కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొననున్న అచ్చెన్నాయుడు, సంధ్యారాణి..

* నేడు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ ప్రెస్ మీట్.. సైబర్ క్రైమ్ గురించి మాట్లాడే అవకాశం..

* నేడు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పర్యటించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిహార నిధుల చెక్కులను అందించనున్న మంత్రి..

* నేడు కడపకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక.. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న వెంకయ్య నాయుడు.. హైదరాబాదు నుండి నేడు కడపకు చేరుకోనున్న మాజీ ఉపరాష్ట్రపతి.. రాత్రికి కడప స్టేట్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్న వెంకయ్యనాయుడు.. రేపు సీపీ బ్రౌన్ గ్రంథాలయ ఉత్సవాలలో పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

* నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

* నేడు మెదక్ జిల్లాకు మంత్రులు కొండా సురేఖ, దామోదర.. నర్సాపూర్ అర్బన్ పార్కులో కాటేజీ ప్రారంభోత్సవం.. కాటేజీని ప్రారంభించనున్న మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ..

* నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన.. రహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో..

* నేడు హైదరాబాద్ లో మీడియా ముందుకు వక్ఫ్ బోర్డు.. వక్ఫ్ ఆస్తులను వేగంగా ఆన్ లైన్ చేస్తున్న ప్రభుత్వం.. 50 మంది సిబ్బందితో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు.. కీలక డాక్యుమెంట్లు మాయంకావడంతో పీఎస్ లో ఫిర్యాదులు.. ఫిర్యాదులపై వివరాలు వెల్లడించనున్న వక్ఫ్ బోర్డు..

* నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కామారెడ్డిలో 30 (ఏ) పోలీస్ యాక్టు అమలు.. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని పోలీసుల హెచ్చరిక..

* నేడు ఛత్తీస్ గఢ్ లో ప్రధాని మోడీ పర్యటన.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఏర్పడి నేటికి 25 ఏళ్లు.. ఛత్తీస్ గఢ్ రజత్ మహోత్సవంలో పాల్గొననున్న మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ..

* నేడు LVM3-M5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు సాయంత్రం 5.26 గంటలకు రాకెట్ ప్రయోగం.. CMS-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో.. 4,410 కిలోల బరువు ఉన్న CMS-03 ఉపగ్రహం..

* నేటి నుంచి గోవాలో చెస్ వరల్డ్ కప్.. 2026 క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించనున్న తొలి మూడు స్థానాల్లో నిలిచే ప్లేయర్లు..

Exit mobile version