NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

* ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..

* ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ.. ఏపీ వ్యాప్తంగా 65,18,496 మంది పెన్షన్‌ లబ్ధిదారులు..

* ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్, బానావత్‌ పాములు నాయక్‌ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్‌ అందజేసిన సీఎం చంద్రబాబు.. పాల్గొన్న మంత్రి నారా లోకేష్‌.. లబ్ధిదారులతో మాట్లాడిన చంద్రబాబు

* పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం.. నేడు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించనున్న నిపుణులు.. టీమ్‌లో అమెరికాకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన ఇదర్దు ఇంజినీర్లు

* హైదరాబాద్‌: నేడు విద్యుత్‌ కమిషన్‌పై కేసీఆర్‌ వేసిన పిటిషన్‌పై తీర్పు.. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. రెండు రోజుల పాటు ఇరు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. నేడు తీర్పు

* విశాఖలో నేడు రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి రెండో రోజు పర్యటన.. ద్వారకా, మద్దిలపాలెం బస్ స్టేషన్‌లు పరిశీలించనున్న మంత్రి.. PDT సిబ్బందితో సమావేశం, రీజియన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న రవాణాశాఖ మంత్రి

* విశాఖ: నేడు పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటన.. పెద్ద గుమ్మలూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న హోం మంత్రి.

* విశాఖ: నేడు సిటీ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్న అడిషనల్ డీజీపీ శంఖబ్రత బాగ్చీ.. ప్రస్తుత CP రవిశంకర్ అయ్యన్నార్ CID చీఫ్ గా బదిలీ..

* కాకినాడ: నేటి నుండి మూడు రోజుల పాటు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన.. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ నుండి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కు రాక.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం బయల్దేరి వెళ్లనున్న పవన్.. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం, మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నేతలతో భేటీ

* శ్రీ సత్యసాయి : సోమందేపల్లిలోని స్నేహలత నగర్ నందు పెన్షన్ పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న బీసీ సంక్షేమం , టెక్స్టైల్ శాఖ మంత్రి సవిత.

* తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నా మంత్రి కందుల దుర్గేష్ తోపాటు ఎమ్మెల్యేలు.. జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.

* అనంతపురం : ఉరవకొండలో జరిగే ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

* విజయవాడ: నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త కేంద్ర చట్టాలకు నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

* శ్రీ సత్యసాయి : హిందూపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే బాలయ్య సతీమణి వసుంధర దేవి

* కృష్ణా: లడఖ్ లో మృతిచెందిన జవాన్ నాగరాజు మృతదేహం నేడు గన్నవరం రాక.. గన్నవరం నుంచి పెడన మృతదేహం పంపటానికి అధికారుల ఏర్పాట్లు

* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్‌ పరిటాల శ్రీరామ్.

* చిత్తూరు: నగరి నియోజకవర్గంలో పెన్షన్ ల పంపిణికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. ఇంటివద్దకే వెళ్లి లబ్ది దారులకు పెన్షన్ పంపిణీ చేసినా భాను ప్రకాష్

* అన్నమయ్య జిల్లా: మదనపల్లె నియోజకవర్గం లో పెన్షన్ ల పంపిణికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా.. ఇంటివద్దకే వెళ్లి లబ్ది దారులకు పెన్షన్ పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే.

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,05 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 28,244 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు

* ప్రకాశం : టంగుటూరు మండలం తూర్పు నాయడు పాలెం, దర్శి మండలం రాజంపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..

* కృష్ణాజిల్లా : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. పెనమలూరు గ్రామంలో అవ్వ తాతలకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన బోడే ప్రసాద్

* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారికి ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ

* నల్లగొండ జిల్లా: నేడు డీసీసీబీ నూతన చైర్మన్ ఎన్నిక. 9 గంటలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్న అధికారులు. తొలుత నామినేషన్ల స్వీకరణ, అనంతరం చైర్మన్ ఎన్నిక.. డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.