NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్.. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. ఆ జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన.. కరీంనగర్, భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారుల సూచన..

* ఏలూరు జిల్లాలో వరద తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో లేట్ నైట్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేపట్టిన ఏపీ సీఎం.. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశం. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని సీఎం సూచన.

* విజయవాడ: నేటి నుంచి దుర్గగుడిలో శాకాంబరీ ఉత్సవాలు.. మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు.. అమ్మవారిని పండ్లు, కూరగాయలతో అలంకరించనున్న దేవస్థానం

* నేడు ఏపీకి రానున్న నీతి ఆయోగ్ బృందం.. ఢిల్లీ నుంచి గన్నవరంకి రాత్రి 8 గంటలకు చేరుకోనున్న నీతి అయోగ్ సీఈఓ సహా ఏడుగురు సభ్యుల బృందం

* హైదరాబాద్‌: నేడు 317 జీవో పై కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం.. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో భేటీ కానున్న కేబినెట్‌ సబ్ కమిటీ

* వరంగల్: 14వ రోజుకు చేరిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు.. నేడు అమ్మవారు మాత్ర క్రమంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు..

* బాపట్ల : చీరాల శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఆషాడం సారే వేడుకలు..

* నెల్లూరు : కందుకూరులో టీడీపీ ఎస్సీ సెల్ నేతలతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ఆత్మీయ సమ్మేళనం..

* నెల్లూరు జిల్లా: రొట్టెల పండగ హాజరైన భక్తులతో వర్చువల్ గా మాట్లాడనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రొట్టెల పండుగలో పాల్గొననున్న మంత్రులు నారాయణ.. ఆనం… ఎన్ ఎమ్ డి ఫరూక్

* తూర్పు గోదావరి జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కలెక్టరేట్, డివిజన్ కార్యాలయాల్లో ముందస్తుగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు

* అనంతపురం : తాడిపత్రిలో మున్సిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం. మున్సిపల్ కార్యాలయంలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.

* నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో భాగంగా సంప్రదాయంగా గంధ మహోత్సవం.. కోటమిట్ట లోని అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకువచ్చిన మత పెద్దలు.. గంధ లేపనం తర్వాత గంధాన్ని భక్తులకు పంచిపెట్టిన నిర్వాహకులు.. గంధ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారాయణ . టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్

* ఏలూరు: ఏజెన్సీ ప్రాంతంలో దంచి కొడుతున్న వర్షాలు.. వర్షాలు తెగ్గేవరకు ప్రజలందరూ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారుల సూచన, స్కూల్స్ కి సెలవు

* ఏలూరు: ఏజెన్సీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ ఆలయం మూసివేత.. కొండవాగులు పొంగడంతో ఆలయం వద్ద చిక్కుకున్న భక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన అధికారులు..

* నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వినుకొండలో దారుణ హత్యకు గురైన, రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం .. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి, మధ్యాహ్నం 12:30 కు వినుకొండ చేరుకోనున్న జగన్.

* అనకాపల్లి జిల్లా: నేడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన.. అచ్యుతాపురం (మం) పూడి దగ్గర ఏర్పాటు చేసిన MSME టెక్నాలజీ సెంటర్, ఇండస్ట్రియల్ కారిడార్ పరిశీలన.. ఏపీ మెడిటెక్ జోన్ అధికారులతో సమావేశం కానున్న మంత్రి

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో : 22,877 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 7,063 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం : 806.80 అడుగులు.. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* పార్వతీపురం మన్యం జిల్లా : నేడు పార్వతీపురం మన్యం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎస్ వి మాధవ్ రెడ్డి

* కర్నూలు: నేడు జగన్నాథ గట్టు పై టిడ్కో కాలనీలో మహిళా మార్ట్ కు శంకుస్థాపన చేయనున్న మంత్రి టి.జి. భరత్

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67223 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24549 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు

* నంద్యాల: నేడు ముచ్చుమర్రి బాలిక (9) కుటుంబాన్ని పరామర్శించనున్న మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి.. ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్న మంత్రులు

* విజయవాడ: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నేడు ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష సమావేశం

* శ్రీ సత్యసాయి : న్యాయవాదుల డిమాండ్లు సాధనలో భాగంగా ధర్మవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు విధులు బహిష్కరణ.

* విశాఖ: నేటి నుంచి రైతు బజార్లలో టమోటా విక్రయాలు… కిలో 58 రూపాయల చొప్పున అమ్మకాలు.. బహిరంగ మార్కెట్లో 100 దాటేసిన టమోటా…

Show comments