*అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం.. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు ఆమోద తెలపనున్న ఏపీ కేబినెట్.. పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న కేబినెట్.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనున్న కేబినెట్.. పెట్టుబడుల అంశంపై చర్చించనున్న ఏపీ మంత్రివర్గం.
*అమరావతి: నేడు కేబినెట్‌లో రాజధాని అథారిటీ అప్రూవల్.. రాజధానికి 34 వేల ఎకరాలు ఇస్తే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.. రాజధాని వల్ల 26 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. -మంత్రి నారాయణ.
*నేడు అనంతపురం వైసీపీ నేతలతో జగన్ భేటీ.. పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రతినిధులతో భేటీ కానున్న జగన్
*హైదరాబాద్: నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులు.. భూభారతి బిల్లుపై చర్చ కొనసాగింపు.. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రవేశపట్టనున్న ప్రభుత్వం.. నేడు అసెంబ్లీలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ.. ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై చర్చ.. రైతు భరోసాపై చర్చ.
*నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనించే అవకాశం.. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
*నేడు భారత్ Vs వెస్టిండీస్ మహిళల మూడో టీ-20 మ్యాచ్.. ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71,340.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,830.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.99,900.