NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు కేబినెట్‌ భేటీ

* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో నీట్ అవకతవకలపై విచారణ.. నీట్ అవకతవకలపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. సుప్రీంకోర్టుకు చేరిన నీట్ సీబీఐ రిపోర్ట్.. నీట్ యూజీ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటున్న కేంద్రం

* అమరావతి: శాంతిభద్రతల అంశంపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల.. గత ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, కేసుల నమోదుపై శ్వేతపత్రం.

* హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్​ సొసైటీ (TGC)) సమీక్షా సమావేశం.. సాయంత్రం 4 గంటలకు రైతునేస్తం.. 500 రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో సీఎం ముఖాముఖి.

* హైదరాబాద్‌: మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రజా భవన్ లో బ్యాంకర్స్ తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం. రుణమాఫీ గురించి బ్యాంకర్లతో చర్చించనున్న భట్టి.. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్న ఉప ముఖ్యమంత్రి.

* ఆదిలాబాద్: నేడు ఆదిలాబాద్ మున్సిపల్ లో వైస్ చైర్మన్ అవిశ్వాసం పై ప్రత్యేక సమావేశం. ఉదయం 11 గంటలకు సమావేశం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.

* నేడు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. డాకుర్ గ్రామంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి దామోదర

* ప్రకాశం : మర్రిపూడి మండలం జూవ్విగుంట దత్తాత్రేయ స్వామి తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలను ప్రారంభించనున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..

* నెల్లూరు : కందుకూరులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్లపై అవగాహన కార్యక్రమం..

* తిరుమల: ఇవాళ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ. ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ ఆర్జిత సేవలకు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమంలో పాల్గొంటారు

* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశం.. అనంతరం జరిగే మీడియా సమావేశంలో పాల్గొంటారు.

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యుల నమోదు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ప్రస్తుతం 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులు.. తాజాగా 9 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా కొత్త సభ్యత్వాల నమోదు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పర్యటన.. ఉదయం 10 గంటలకు పెరవలి ఆర్యవైశ్య సత్రం నందు బియ్యం మరియు కందిపప్పు స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11గంటలకు ఉండ్రాజవరం ఆర్యవైశ్య సత్రంలో బియ్యం మరియు కందిపప్పు స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నిడదవోలు ఫ్లైఓవర్ వర్క్స్ ఇన్స్పెక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి క్వారీ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.

* విజయవాడ : నేడు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రి నాదెండ్ల మనోహర్

* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి మండలంలోని పెడపల్లిలో అక్కమ్మ గార్ల ఉత్సవాలు ప్రారంభం.

* శ్రీ సత్యసాయి : నేడు పెనుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత.

* విజయవాడ: ఇంకా దొరకని నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ.. ఏలూరు కాల్వలో నిన్నంతా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం శూన్యం.. నేడు మరోమారు గాలింపు చర్యలు చేపట్టనున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం

* విజయనగరం జిల్లా నేటి నుంచి‌ డీఎస్ఏ లో బాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు..

* అన్నమయ్య జిల్లా : నందలూరు సౌమ్య నాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదవరోజు కార్యక్రమాలు.. ఉదయం: శేషవాహనము : స్నపన తిరుమంజనం.. సాయంత్రం : డోలోత్సవం.. రాత్రి: గరుడ వాహనం..

* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,029 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 28,547 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.9 కోట్లు