NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

* ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌.. రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

* ఏలూరు: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన.. పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష..  ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సారి పోలవరానికి చంద్రబాబు

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,870 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 42,119 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4 కోట్లు

* తిరుమల: రేపు ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవలకు సంబంధించిన రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం

* తిరుమల: ఎల్లుండి నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. ఈ సందర్భంగా మూడు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.

* తిరుమల: 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* నెల్లూరు నగరంలోని శ్రీ రంగనాథ స్వామి పెంచలకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను సందర్శించనున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

* ప్రకాశం : బక్రీదు పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్నీ ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న ముస్లింలు..

* ప్రకాశం: రబీలో కరువు పరిస్థితిని పరిశీలించేందుకు రేపటి నుంచి జిల్లాలో నాలుగు రోజుల పాటు కరువు బృందం పర్యటన..

* బాపట్ల : ముప్పవరం లోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* తిరుపతి: నేటి నుండి ఐదురోజుల పాటు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం

* అనంతపురం : నేడు జిల్లాకు రానున్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న మంత్రి. గుత్తి సరిహద్దులో స్వాగత ఏర్పాట్లు చేసిన కూటమి నాయకులు.

* నంద్యాల: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా నేడు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, సాయంత్రం పల్లకి సేవ

* శ్రీ సత్యసాయి : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి చేపట్టిన తరువాత తొలిసారిగా ధర్మవరం రానున్న సత్యకుమార్ యాదవ్. స్వాగతం పలకనున్న ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు.