NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* అన్నమయ్య జిల్లా: నేడు తిరుపతి, మదనపల్లెలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పర్యటన.. మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్‌పోర్టులో అధికారులతో రహదారులపై సమీక్ష.. సత్సంగ్ ఫౌండషన్ నిర్మించిన అదినాద్ శ్రీగురు మహావతార్ బాబాజీ ఆలయాన్ని ప్రారంభించి, పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గడ్కరీ.. రాత్రి తిరుమలలో బస చేయనున్న గడ్కరీ

* ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ హస్తినలోని ఏపీ సీఎం అధికారిక నివాసం 1 జనపథ్ లో పూజలు నిర్వహించనున్న చంద్రబాబు.. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం.

* గుంటూరు: నేడు తాడేపల్లి మండలం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ప్రజా దర్బార్.. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించనున్న మంత్రి లోకేష్..

* తిరుమల: రేపు ఆన్ లైన్ లో అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ..

* ప్రకాశం : మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఉంటారు..

* ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతమాగులూరులో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు..

* ప్రకాశం : యర్రగొండపాలెం మండలం లోని నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ పాలంక క్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా పాలంక వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు..

* ప్రకాశం: కంభం మండలం రావిపాడులో మొహరం పండుగను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు..

* ప్రకాశం : ఒంగోలు లోని జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ఎస్పీగా భాద్యతలు స్వీకరించనున్న ఏఆర్ దామోదర్

* నేడు గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న యస్ సతీష్ కుమార్..

* నేడు బాపట్ల ఎస్పీగా భాద్యతలు స్వీకరించనున్న తుషార్ డూడి..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ.. ఆనం రామనారాయణరెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు

* నెల్లూరులోని స్వర్ణాల చెరువులో నేటి నుంచి రొట్టెల పండుగ

* అనంతపురం: నార్పల మండలం గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు జలిది మహోత్సవం.

* తూర్పుగోదావరి: నేడు ఆషాడ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండుగ తొలి ఏకాదశి.. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే పండుగ తొలి ఏకాదశి.. తొలి ఏకాదశి సందర్భంగా రాజమండ్రి దానవాయిపేట పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

* విశాఖ: “సంక్షోభంలో విశాఖ ఉక్కు-అధిగమించడం ఎలా”అనే అంశంపై కీలక సదస్సు నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు.. పాల్గొననున్న సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి లలిత్ మిశ్రా..

* కృష్ణాజిల్లా ఎస్పీగా నేడు బాధ్యతలు చేపట్టనున్న గంగాధర్ ఐపీఎస్

* నేడు కడప జిల్లా నూతన ఎస్పీ గా భాద్యతలు చేపట్టనున్న వి.హర్షవర్ధన్ రాజు … కడపజిల్లా పోలీసు కార్యాలయం లో ఉదయం 11 గంటల బాధ్యతలు చేపట్టనున్న నూతన ఎస్పీ…

* మొహరం పండుగ సందర్భంగా నేడు గుంటూరు మిర్చి యార్డుకు సెలవు…

* పశ్చిమగోదావరి జిల్లా: పాలకొల్లులో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి నిమ్మల రామానాయుడు..

* తిరుపతి: మహిళవర్శిటిలో జాతీయ విద్యా విదానంపై నేటి నుంచి రెండు రోజుల పాటు సదస్సు …

* పల్నాడు: నేడు నాగార్జునసాగర్ నుండి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయనున్న అధికారులు .. తాగునీటి అవసరాల కోసం ఏపీ కి నాలుగున్నర టీఎంసీలు నీటిని కేటాయించిన కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్… పల్నాడు ప్రాంతంలోని సాగర్ పరివాహక గ్రామాలలో, 234 రక్షిత మంచినీటి చెరువుల కోసం, ప్రతిరోజు 5,500 క్యూసెక్కులు చొప్పున , 9 రోజులు పాటు నీటిని విడుదల చేయనున్న అధికారులు…

* రాజన్న సిరిసిల్ల జిల్లా: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, పరివార దేవతార్చన నిర్వహించిన అర్చకులు.. సాయంత్రం శ్రీ విఠలేశ్వర స్వామివారికి మహా పూజ నిర్వహించనున్న ఆలయ అర్చకులు

* తిరుమల: 10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,409 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,128 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు