NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: నేడు సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – సీజనల్ కండిషన్స్, హెల్త్ – సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, భద్రతా సంబంధిత సమస్యలు, యాంటి డ్రగ్ క్యాంపెయిన్ వంటి సుమారు తొమ్మిది అంశాలపై సమీక్ష.. పాల్గొననున్న సీఎస్, డీజీపీ, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు

* హైదరాబాద్‌: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరామ్.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్స్ పై పలు వివరాలు అడిగి తెలుసుకోనున్న కమిషన్

* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ కానున్న మంత్రివర్గం. వివిధ కీలకాంశాలపై చర్చ. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్‌లో సమీక్ష.. ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై చర్చ. వూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ.

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. ఉదయం ఘంటా మండపంలో ఆస్థానం నిర్వహించనున్న అర్చకులు.. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు,విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.

* కేసీఆర్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించిన కేసీఆర్‌

*నెల్లూరులోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఆనంద్ సమీక్ష సమావేశం

* అమరావతి: నేడు వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టలో విచారణ.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వైసీపీ సజ్జల, తలశిల, అప్పిరెడ్డి, ఆర్కే, దేవినేని అవినాష్, నందిగామ సురేష్ పిటిషన్లు..

* శ్రీ సత్యసాయి : ముద్దిరెడ్డిపల్లిలోని రుక్మిణి పాండు రంగస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కల్యాణోత్సవం.

* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..

* గుంటూరు : మొహర్రం పండుగ సందర్భంగా , రేపు గుంటూరు మిర్చి యార్డుకు సెలవు.. రైతులు బుధవారం యార్డుకు మిర్చి తీసుకురావద్దని అధికారులు సూచన…

* అనంతపురం : లంచం తీసుకుంటూ పట్టుబడిన వజ్రకరూరు మండల తహసీల్థారు మహ్మద్ రఫీని అరెస్ట్ చేసిన ఏసిబి అధికారులు. ఇవాళ కర్నూలు ఏసిబి కోర్టులో హాజరు పరచనున్న అధికారులు.

* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని చెన్నకేశవపురం గ్రామంలొ ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పణ కార్యక్రమం.

* అనంతపురం : నార్పల మండలం గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు పెద్దసరిగెత్తు.

* అన్నమయ్య జిల్లా : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం పల్లకి ఉత్సవము, స్నపన తిరుమంజనం, సాయంత్రం డోలోత్సవము, ఊంజల్ సేవ, రాత్రి సింహవాహనము

* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,054 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,239 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు