NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు నేపాల్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న కేపీ శర్మ ఓలీ

* అమరావతి: నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు 4వ శ్వేతపత్రం.. గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

* ఢిల్లీ: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్.. విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసీఆర్

* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని దామచర్ల ఆంజనేయులు జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు..

* ప్రకాశం : ఇవాళ ఒంగోలుకు రానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ కార్యకర్తలతో సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

* బాపట్ల : చీరాలలో సజ్జా చంద్రమౌళి జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య..

* విశాఖ: నేడు బీజెపీ ఎమ్మేల్యేలు, ఎంపీలకు పౌర సన్మానం.. పాల్గొననున్న ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ర్ట మంత్రి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి..

* విశాఖ: నేడు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటన.. కింగ్ జార్జ్ హాస్పిటల్ సమస్యలు, వసతులు కల్పనపై సమీక్షం చనున్న మంత్రి

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. రేపు సాయంత్రం 6 గంటలకు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

* నేడు ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న కె. ప్రతాప్ కిషోర్..

* నేడు ఏలూరు కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న కలెక్టర్ వెట్రీ సెల్వి

* నెల్లూరు జిల్లా: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు.

* నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న కృష్ణకాంత్

* అనంతపురం : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి సీనియర్ మహిళా అంతరజోన్ క్రికెట్ టోర్నీ.

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుండి జిల్లాలో పలు ప్రాంతాలలో 15 రోజులపాటు పవర్ కట్.. ఏపీ ట్రాన్స్‌కో ప్రధానమైన 132కేవీ లైన్ ను మార్పు చేయుటలో భాగంగా పవర్ కట్.. నేటి నుండి 30వ తేదీ వరకు , అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం చుట్టుప్రక్కల ఏరియాలలో ఉదయం 6గంటల నుండి సాయత్రం 6గంటల మధ్యలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం
వచ్చే అవకాశం

* తూర్పు గోదావరి జిల్లా: నేడు “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ.. ప్రజల నుంచి అర్జిల స్వీకరణ.. జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలని సూచించి కలెక్టర్ పి. ప్రశాంతి .

* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులుకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,797 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,497 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు

* మహబూబ్ నగర్: నేడు జడ్చర్ల నియోజక వర్గంలో మంత్రులు కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన

* నేడు వరంగల్ జిల్లాలో ఆరుగురు మంత్రుల పర్యటన.. రైతు భరోసా సదస్సుకు హాజరుకారుల ఆరుగురు మంత్రులు

* నేడు బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..