NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ ఘటనపై వైద్యుల సంఘం ఆందోళన.. నేటి నుండి దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన..

* ఏపీ: నేడు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు మొత్తం 89,882 దరఖాస్తులు.. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల ఆదాయం

* అమరావతి: ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి ప్రారంభంకానున్న పల్లె పండుగ వారోత్సవాలు. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనున్న ప్రభుత్వం.

* విశాఖ: నేడు దక్షిణ బంగాళా ఖాతంలో అల్పపీడనం బలపడి తుఫాన్ గా మారే అవకాశం.. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్..

* అమరావతి: ఇవాళ ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేసి, అనంతరం సభలో మాట్లాడనున్న పవన్

* ప్రకాశం : కొండపి మండలం పెట్లూరులో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి..

* బాపట్ల : సంతమాగులూరు మండలం ఏల్చూరులో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* ప్రకాశం : జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు లాటరీ ప్రక్రియ.. 171 మద్యం షాపులకు 3466 దరఖాస్తులు.. ఒంగోలు అంబేద్కర్ భవన్ లో ఉదయం 8 గంటల నుంచి లాటరీకి రెండు కౌంటర్లు ఏర్పాటు..

* కాకినాడ జిల్లా లో 155 మద్యం షాప్ లకు లాటరీ విధానంలో నేడు లైసెన్స్ లు మంజూరు.. 155 షాప్ లకు 3382 దరఖాస్తు లు,66.64 కోట్లు ఆదాయం

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు

* ప్రకాశం : అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కలెక్టరేట్ లో 1077 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు.. గత నాలుగు రోజులుగా జిల్లాలో ముసురు వాతావరణం..

* కాకినాడ: నేడు పిఠాపురం మున్సిపాలిటీలో విచారణ చేయనున్న ఉన్నతాధికారులు.. ఆగస్టు 31న కౌన్సిల్ సమావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కమిషనర్ కనకారావు, డి ఈ ఈ భవాని ప్రసాద్.. డీఈఈ ను సస్పెండ్ చేసిన కలెక్టర్, సస్పెన్షన్ రద్దు చేసిన హైకోర్టు.. విచారణకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

* విజయవాడ: నేడు మద్యం షాపులకు లాటరీ విధానంలో కేటాయింపులు.. ఏపీలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు 5825 దరఖాస్తులు.. 7 గంటలోపు లాటరీ తీసే ప్లేస్ కు రావాలని దరఖాస్తు దారులకు ఆదేశాలు.. కృష్ణాజిల్లాకు సంబంధించి మచిలీపట్నంలో 123 షాపులకు 2942 దరఖాస్తులు

* తిరుపతి: నేటి నుంచి ఈ నెల 17 వరకు తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన.. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్ళరాదు.. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్దంగా వుండాలి.. ఎట్టి పరిస్థితిలోనూ మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు అని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలు.. పర్యాటక ప్రాంతాలైన కైలాసకోన, అరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్ నందు, సముద్ర బీచ్ ప్రాంతాల నందు నాలుగు రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యాటక సందర్శకులకు అనుమతి లేదు.. జిల్లా కలెక్టరేట్ లో 08772236007 కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు

* కడప : కడప జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు

* తూర్పు గోదావరి జిల్లా: నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా 253 గ్రామ పంచాయతీల పరిథిలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు.. ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకూ షెడ్యూలు ఖరారు .. ప్రజా ప్రతినిధులు సమక్షంలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకి శ్రీకారం

* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిడదవోలు మండలంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కందుల దుర్గేష్.. మధ్యాహ్నం తర్వాత విజయనగరం కు పయనం.

* కడప : నేడు జిల్లా పరిషత్ ప్రాంగణంలో మద్యం షాపులకు లాటరీ… నిమిషం ఆలశ్యం అయినా అనుమతి లేదు… ఉదయం 7.30 గంటలకే దరఖాస్తుదారులు జెడ్పీ ప్రాంగణం చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ ఆదేశాలు..

* అన్నమయ్య జిల్లా : చిన్నమండెం, గాలివీడు, రాయచోటి మండలాల్లో పర్యటించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

* అన్నమయ్య జిల్లా : నేడు అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) ను తాత్కాలిక రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి..

* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణంలోని అజయ్ రెసిడెన్సి లో జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా మద్యం షాపులను కేటాయించునున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.

* నెల్లూరు జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం.. కలెక్టరేట్ లో 0861-2331261, 7995576699, 1077 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు లాటరీ ద్వారా మద్యం షాపులు ఎంపిక.. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో, అమలాపురంలోని కలెక్టరేట్ లో జరుగునున్న లాటరీ ప్రక్రియ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 413 మద్యం షాపులకు 11 628 దరఖాస్తులు..

* అనంతపురం : నేడు మద్యం దుకాణాల టెండర్ల లాటరీ. జిల్లాలో 136 దుకాణాలకు 3,261 దరఖాస్తులు.. సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు 1,518 దరఖాస్తులు.

* నెల్లూరు: నేడు జిల్లాలో లాటరీ ద్వారా 182 మద్యం దుకాణాల కేటాయింపు.. ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియ.. 182 దుకాణాలకు 3 వేల 872 దరఖాస్తులు

* పశ్చిమ గోదావరి: పాలకొల్లు మండలం గోరింతాడ గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నిమ్మల రామనాయడు,

* ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు 5వేల 496 దరఖాస్తులు..

* పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 5,627 దరఖాస్తులు.. మద్యం షాపుల లాటరీ కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు..

* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మద్యం దరఖాస్తుల లాటరీ… గుంటూరు జిల్లాలో 127 షాపులకు 4,372 అప్లికేషన్లు … పల్నాడు జిల్లాలో 129 షాపులకు, 2,577 దరఖాస్తులు, బాపట్ల జిల్లాలో 117 షాపులకు 2,064 దరఖాస్తులు నమోదు.. లాటరీ పద్ధతిలో నేడు విజేతలను ప్రకటించనున్న అధికారులు ..

* అనంతపురం : గుంతకల్లు నియోజకవర్గంలోని గ్రామాలలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ప్రారంభం.

* కర్నూలు: హోళగుంద మండలం దేవరగుట్టు లో శ్రీ మాల మల్లేశ్వర స్వామి రథోత్సవం….

* తిరుపతి: రాత్రి నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. తిరుపతి జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌ వేంకటేశ్వర్లు

* ఖమ్మం: నేడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పలు అభివృద్ధి పథకాలకు శంఖుస్థాపనలు

Show comments