* నేడు యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. తెలంగాణలో కొనసాగుతున్న యూరియా కష్టాలు.. యూరియా కోసం క్యూలైన్లలో వేచి ఉంటున్న రైతులు..
* నేడు గద్వాలలో కేటీఆర్ బహిరంగ సభ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్..
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు..
* నేడు పాతబస్తీలో ఎంఐఎం పార్టీ సభ.. రాత్రి 10 గంటలకు ఒవైసీ బ్రదర్స్ ఆధ్వర్యంలో సభ..
* నేడు గ్రూప్-2కు ఎంపికైనవారి సర్టిఫికేట్ల పరిశీలన.. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో.. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్న సర్టిఫికేట్ల పరిశీలన..
* నేడు విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రేపు రైల్వే గ్రౌండ్లో BJP బహిరంగ సభకు ముఖ్య అతిథిగా నడ్డా.. రాష్ట్ర పదాతికారుల సమావేశంలో పాల్గొనున్న నడ్డా.. AP మెడిటెక్ జోన్ అధికారులతో సమావేశం..
* నేడు గుంటూరు, ప్రత్తిపాడులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. గుంటూరులో ఉమెన్స్ కాలేజీ, కాకుమానులో సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ పరిశీలించనున్న పెమ్మసాని..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన.. నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచన.. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
* నేడు మణిపూర్ లో ప్రధాని మోడీ పర్యటన.. 2023 హింస తర్వాత తొలిసారి మణిపూర్ లో ప్రధాని పర్యటన.. చురాచాంద్ పూర్ లో రూ. 7,300 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన.. మణిపూర్ లో బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
* నేటి నుంచి ప్రజాక్షేత్రంలోకి టీవీకే పార్టీ అధినేత.. ప్రజా సమస్యలపై ఫోకస్ చేయనున్న నటుడు విజయ్.. తిరుచ్చి నుంచి ప్రారంభించనున్న విజయ్..
* నేడు ఆసియా కప్ లో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. అబుదాబిలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం..
