NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్.. జార్ఖండ్‌లోని 43 నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోలింగ్.. 81 స్థానాలకు గానూ 43 నియోజకవర్గాల్లో నేడు ఎన్నికలు.. పోలింగ్‌ ప్రారంభం కావడంతో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు.. జార్ఖండ్ 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో 683 మంది అభ్యర్థులు.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.37 కోట్ల మంది ఓటర్లు.

*కేరళ: నేడు వయనాడ్‌లో ఉపఎన్నికకు పోలింగ్.. వయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు, మరో 31 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు.. ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో నేడు పోలింగ్.

*అమరావతి: నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.. ఏపీ మున్సిప‌ల్ బిల్లు- 2024ను అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టనున్న మంత్రి నారాయ‌ణ‌.

*తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానం.. మాడవీధులలో ఉరేగుతున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉగ్రశ్రీనివాసమూర్తి.. ఏడాదికి ఒక్కసారే ఆలయం వెలుపలికి రానున్న ఉగ్రశ్రీనివాసమూర్తి.. సూర్యోదయం లోపు ఊరేగింపు పూర్తి.

*ఏలూరు: నేడు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం.. రాత్రి 8 గంటలకు నృసింహ సాగరంలో హంస వాహనంపై విహరించనున్న చిన్న వెంకన్న.

*ఐదో రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. నేడు అనుగ్రహ భాషణం చేయనున్న శ్రీ అద్వైతానంద భారతి స్వామీజీ.. ప్రవచనామృతం వినిపించనున్న డా.ఎన్. అనంతలక్ష్మి.. వేదికపై శ్రీ వెంకటేశ్వరస్వామికి కోటి తులసి అర్చన.. మహానందికి మహాభిషేకం.. భక్తులచే విష్ణుమూర్తి విగ్రహాలకు కోటి తులసి అర్చన.. నేడు తులసీ దామోదర కల్యాణం.. పల్లకీ సేవలో భక్తులను కటాక్షించనున్న ఆదిదంపతులు

*నేడు భారత్ సౌతాఫ్రికా మూడో టీ20 మ్యాచ్.. సెంచూరియన్ వేదికగా రాత్రి 8:30 గంటలకు మ్యాచ్.. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-1తో సమంగా ఇరుజట్లు.

 

Show comments