* నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్.. ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది.. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. పోలింగ్కు 1,761 మంది పోలీసులతో భద్రతా.. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు.. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల వినియోగం.. డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేయనున్న అధికారులు.. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగం..
* నేడు బీహార్ లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. మలి విడతలో 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు..
* నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పీసీ పల్లి మండలం లింగన్న పాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించనున్న చంద్రబాబు.. ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరనున్న సీఎం.. 10.35 నుంచి 12.15 వరకు ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు.. 12.30కి హెలికాప్టర్ లో ఉండవల్లి బయలుదేరి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు..
* నేడు సీఎం చంద్రబాబు చేత వర్చువల్ గా పలు పరిశ్రమలకు శంకుస్థాపన.. ఓర్వకల్, పెద్దకడుబూరు, దేవనకొండ మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న సీఎం..
* నేడు గుంటూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన.. వాటర్ షెడ్ జాతీయ సెమీనార్ లో భాగంగా గుంటూరు రూరల్ మండలం వెంగళాయ పాలెం చెరువును పరిశీలించనున్న శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. అనంతరం నల్లపాపాడు లయోలా స్కూల్ లో బహిరంగ సభలో పాల్గొనున్న కేంద్ర మంత్రి..
* నేడు కాకినాడ కలెక్టరేట్ లో ఇంఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం.. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో రివ్యూ..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
