* నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. క్వాంటమ్ కంప్యూటర్ పాలసీని కేబినెట్ లో ప్రవేశ పెట్టనున్న మంత్రి లోకేష్.. క్వాంటమ్ కంప్యూటర్ పై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్..
* నేడు నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. విశ్వసముద్ర ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవం.. స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ప్రారంభించనున్న సీఎం.. రూ. 8.40 కోట్లతో 200 షాపులు మంజూరు చేసిన ప్రభుత్వం.. తొలి విడతలో సిద్ధిమైన 120 షాపులు..
* నేటి నుంచి 40 రోజుల పాటు వైసీపీ ప్రజా ఉద్యమం.. నేటి నుంచి నవంబర్ 22 వరకు వైసీపీ రచ్బబండ.. ఈనెల 28న నియోజకవర్గాల్లో వైసీపీ ర్యాలీలు..
* నేటి నుంచి ఏపీలో నిలిచిపోనున్న ఎన్టీఆర్ వైద్య సేవలు.. బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ ఆస్పత్రుల డిమాండ్..
* నేడు మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. ఆర్టినెన్స్ ఆమోదానికి ప్రయత్నం చేయాలా అనే దానిపై చర్చ.. కోర్టు తీర్పును అధ్యయనం చేయస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహించకుంటే ఎదురయ్యే సమస్యలపైనా చర్చ..
* నేడు నిజామాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి.. ఇటీవల ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మాతృవియోగం.. భూపతిరెడ్డిని పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
* నేడు కంది గ్రామ నిర్వాసితులతో జగ్గారెడ్డి సమావేశం.. ముంబై హైవే విస్తరణలో ఇళ్లు కోల్పోయిన కంది ప్రజలు..
* నేడు ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ నేతల సమావేశం.. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చించనున్న బీజేపీ నేతలు.. మూడు పేర్లతో అధిష్టానానికి నివేదిక పంపనున్న రాష్ట్ర బీజేపీ.. ఎన్నికల కార్యచరణతో పాటు నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్న బీజేపీ..
* నేడు కాఫ్ సిరప్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ.. న్యాయవాది విశాల్ పిటిషన్ పై విచారించనున్న సుప్రీం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఔషధ నియంత్రణ సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్.. సిరప్ అమ్మకాలు నిషేధించాలని కోరిన విశాల్ తివారీ..
* నేడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ.. విజయ్ పిటిషన్ తో పాటు బీజేపీ పిటిషన్ పైనా విచారణ..
* నేడు సాయంత్రం నోబెల్ బహుమతి ప్రకటన.. ట్రంప్ కు బదులుగా సడాన్ సంస్థకు లేదా బెలూచిస్థాన్ కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం..
* నేడు ఢిల్లీ వేదికగా భారత్- వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉదయం 9. 30 గంటలకి మ్యాచ్ ప్రారంభం..
* నేడు మహిళల వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న బంగ్లాదేశ్ మహిళల జట్టు..
