NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

సీఎం రేవంత్ రెడ్డి నేడు గూగుల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ.. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో బయో డిజైన్ సెంటర్‌కి వెళ్లనున్న సీఎం.. వర్సిటీలో సస్టెనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో వివిధ అంశాలపై చర్చ.. అక్కడే పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు తగిన అవకాశాలు కల్పిస్తామని రేవంత్ ప్రకటన.
నేడు వైరాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న భట్టి..
నేడు ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
నేడు ఉదయం 11 గంటలకు నీటి పారుదల శాఖ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం.. చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో తొలి సమావేశం.. రాష్ట్రంలోని జలాశయాలు వాటి పరిస్థితి, పునరుద్ధరణ అంశాలపై పరిశీలన చేసి సిఫార్సులు చేసేందుకు కేంద్ర జల వనరుల శాఖ సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు.
నేడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో పర్యటన.. సుబ్బారాయుడి కుటుంబానికి జగన్ పరామర్శ..
నేడు సినిమాటోగ్రఫీ, టూరిజం, సాంస్కృతిక శాఖలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష..
నేడు గరుడ వాహనంపై శ్రీవారి దర్శనం.. గరుడ పంచమి సందర్భంగా శ్రీవారికి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై ఊరేగనున్న మలయప్పస్వామి..
నేటి మధ్యాహ్నం 12 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల.. ఆన్ లైన్ ద్వారా రేపుటి 250 అంగప్రదక్షణ టోకెన్లను విడుదల చేయనునన్న టీటీడీ..
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. వందకు పైగా దేశాల్లో గిరిజనుల వేడుకలు..
నేడు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు..