* నేడు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. ఉర్జవీర్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
* నేడు కడపకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నగరంలోని మున్సిపల్ స్కూల్ లో విద్యార్థుల తల్లిదండ్రులతో పవన్ ముఖాముఖి.. కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన మున్సిపల్ స్కూల్ కి చేరుకోనున్న పవన్..
* నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. నార్కట్ పల్లి మండలం బ్రహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభించనున్నారు. ఎస్ఎల్బీసీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగం..
* నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న పొన్నం.. ప్రభుత్వం తరపున స్వయంగా ఆహ్వానించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
* నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్న మంత్రి జూపల్లి.. ప్రజాపాలన విజయోత్సవాలకు గవర్నర్ ను ఆహ్వానించనున్న జూపల్లి..
* నేడు సరూర్ నగర్ లో బీజేపీ సభ.. హాజరుకానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
* నేడు లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నించనున్న పోలీసులు..
* నేడు అమరావతిలో మెగా పేరెంట్ టీచర్ మీట్.. దేశంలోనే తొలిసారి ఏపీలో పేరెంట్ టీచర్ మీట్.. ప్రభుత్వ పాఠశాలలు, జడ్పీ, యూపీ స్కూల్స్ లో నిర్వహణ.. ప్రతి స్కూల్ లో పూర్వ విద్యార్థులకు సైతం ఆహ్వానం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం.
* నేడు తిరపతిలో పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం.. 8 టన్నుల పుష్పాలతో అమ్మవారి యాగం..
* నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం. ఈ నెల 11 నుంచి దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71,410.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 77,610.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 1,00.900.