NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*తిరుమల: నేడు మూడోరోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఉదయం సింహవాహనంపై ఊరేగనున్న శ్రీవారు.. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి దర్శనం.

*విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. శ్రీలలితాత్రిపురసుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తుల రాక.. ఆదివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం.. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతున్న అధికారులు.. దుర్గమ్మ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.

*తెలుగు రాష్ట్రాలకు 4 రోజుల పాటు భారీ వర్షసూచన.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనున్న అల్పపీడనం.. వాతావరణ శాఖ వెల్లడి.

*శ్రీశైలంలో 4వ రోజు వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు.. సాయంత్రం కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం.. కైలాసవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న శ్రీస్వామి అమ్మవారు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం.

*మెదక్ : ఐదు రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం.. రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు చేసి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు.. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని మరోసారి విడుదల చేయడంతో ఆలయం ఎదుట పెరిగిన వరద.. భక్తులకు కూష్మాండదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న వనదుర్గా భవాని

*మూసీ పరిరక్షణ కోసం నల్గొండ జిల్లా నేతలు, రైతుల సమావేశం.. మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు సహకరించాలని డిమాండ్.. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులను మూసీ కాలుష్యం నుంచి కాపాడాలని తీర్మానం.

*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,552 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.54 కోట్లు.

*కృష్ణా: నేడు తిరువూరులో పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే కొలికపూడి సమావేశం.. ఎమ్మెల్యేపై పార్టీ నేతలే నిరసనకు దిగిన నేపథ్యంలో నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ చిన్ని సమక్షంలో మీటింగ్.. కలిసి పని చేస్తామని ఎమ్మెల్యే కొలికపూడి ప్రకటన తర్వాత నేడు జరుగుతున్న కార్యకర్తల సమావేశానికి ప్రాధాన్యత.

*కాకినాడ: నేడు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు.. ఐదు డైరెక్టర్ పదవులకు పోటీలో ఉన్న 12 మంది అభ్యర్థులు.. టీడీపీ మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు, జనసేన మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు.. కూటమిగా పోటీ చేయాలని ఆదేశించిన చంద్రబాబు.. ముగ్గురు జనసేన, ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఇరు పార్టీలు నిర్ణయం.

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,670.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,03,000.

*నేడు భారత్-బంగ్లాదేశ్ తొలి టీ20 మ్యాచ్.. గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.

*నేడు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు విండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్.

Show comments