NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*అమరావతి: నేడు జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం.. జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో-ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శుల, కార్యదర్శులతో భేటీ.. పార్టీ బలోపేతం, నిర్మాణంపై ప్రధానంగా దృష్టి.

*అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు.. పార్టీ ఆఫీస్‌లో ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం.

*నెల్లూరు: పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.. ఇవాళ సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు ముహూర్తం.. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు.. ఒక్కో ప్రోబా-త్రీ ఉపగ్రహం బరువు 550 కేజీలు.. సూర్యునిపై పరిశోధనలు చేయనున్న 2 ఉపగ్రహాలు.

*కాకినాడ:నేడు పోర్టులో రేషన్ బియ్యంతో ఉన్న స్టెల్లా ఎల్ షిప్‌ను పరీశీలించనున్న కలెక్టర్ నియమించిన మల్టీ డిసిప్లినరీ కమిటీ.. షిప్‌లో ఉన్న రైస్ లోడ్ తనిఖీ చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ సీజ్ చేయనున్న కమిటీ.. కమిటీలో సభ్యులుగా పోలీస్,పోర్టు ,రెవెన్యూ, కస్టమ్స్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు.. ఇప్పటికే ఆ షిప్‌లో ఉన్నవి రేషన్ బియ్యం అని కలెక్టర్ క్లారిటీ.. విచారణ అనంతరం అసలు బ్యాంక్ గ్యారెంటీ ఉన్న బియ్యమా కాదా అనే విషయంపై స్పష్టత.. బ్యాంక్ గ్యారెంటీతో ఉన్న పీడీఎస్ నిల్వలు ఎగుమతి చేయవచ్చా లేదా అనేది లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న అధికారులు.

*తిరుపతి: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం సూర్య ప్రభ వాహనంపై… రాత్రి చంద్ర ప్రభ వాహనంపై విహరించనున్న అమ్మవారు

*నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇలా.. ఉదయం 11.30కు ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా కొత్తగూడ బొటానికల్​ గార్డెన్​ సమీపంలో తెలంగాణ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన. వర్చువల్ సఫారి, వృక్ష పరిచయ కేంద్రం ప్రారంభం… మధ్యాహ్నం 12 గంటలకు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య సంస్మరణ దినోత్సవం.. మధ్యాహ్నం 2.45 కు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో పెద్దపల్లికి బయల్దేరుతారు.. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలో యువవికాసం సభకు హాజరవుతారు.

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,310.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,790.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.99,400.

Show comments