* నేడు అనకాపల్లిలో మోడీ ఏళ్ల పాలనపై మేధావుల సమావేశం.. ముఖ్య అతిథిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్.. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమంపై చర్చ
* గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత వారాహి యాత్ర పర్యటన మరో రెండు రోజులు పొడిగింపు.. నేడు ముమ్మిడివరంలో ఉదయం జనవాణి.. సాయంత్రం భారీ బహిరంగ సభ.. 22వ తేదీన అమలాపురంలో జనవాణి.. 23వ తేదీన సాయంత్రం అమలాపురంలో భారీ బహిరంగ సభ.. 24న పి.గన్నవరం, రాజోలులో పర్యటన.. 25న రాజోలు మలికిపురంలో భారీ బహిరంగ సభ
* ప్రకాశం: ఒంగోలులో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
* విశాఖ పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ముఖ్య అతిథిగా పార్లమెంటరీ, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్
* మంచిర్యాల: నేడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన.. లక్షేట్టిపేటలో మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా బహిరంగ సభ.. సభలో పాల్గొననున్న బండి సంజయ్
* సిద్దిపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
* నేడు హైదరాబాద్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అనుచరుల భేటీ.. కాంగ్రెస్‌లో చేరికపై అనుచరులకు స్పష్టత ఇవ్వనున్న పొంగులేటి
* పల్నాడు: నేడు చిలకలూరిపేట పదో వార్డు ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని
* కరీంనగర్: నేడు జిల్లాలో కేటిఆర్ పర్యటన.. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న కేటీఆర్.. మానేరుపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్‌ని ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్
* అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న మోడీ.. మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న మోడీ
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Show comments