Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

  • ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి తొలిదశ ప్రారంభం, ప్రారంభించనున్న ప్రధాని.. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేతో సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం.. భారత్‌లోనే అతిపెద్దదిగా ఢిల్లీ-ముంబై జాతీయ ఎక్స్‌ప్రెస్ రహదారి
  • నేడు రాజస్థాన్‌లో ప్రధాని మోడీ పర్యటన.. దౌసాలో రూ.18 వేల కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
  • నేడు యూపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
  • మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్.. పాకిస్తాన్‌తో తలపడనున్న భారత మహిళల జట్టు.. కేప్‌టౌన్ వేదికగా సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్
  • నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీలో నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
  • నేడు శ్రీశైలంలో రెండవరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు
  • గుంటూరులో నేడు బీపీ మండల్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ.. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్‌లో బీసీల ఆత్మగౌరవ సభ