ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి తొలిదశ ప్రారంభం, ప్రారంభించనున్న ప్రధాని.. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేతో సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం.. భారత్‌లోనే అతిపెద్దదిగా ఢిల్లీ-ముంబై జాతీయ ఎక్స్‌ప్రెస్ రహదారి
నేడు రాజస్థాన్‌లో ప్రధాని మోడీ పర్యటన.. దౌసాలో రూ.18 వేల కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
నేడు యూపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్.. పాకిస్తాన్‌తో తలపడనున్న భారత మహిళల జట్టు.. కేప్‌టౌన్ వేదికగా సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్
నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీలో నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
నేడు శ్రీశైలంలో రెండవరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు
గుంటూరులో నేడు బీపీ మండల్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ.. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్‌లో బీసీల ఆత్మగౌరవ సభ