Site icon NTV Telugu

What Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* కాకినాడ: అన్నవరంలో నేటి నుంచి ధర్మ ప్రచార మాసోత్సవాలు ప్రారంభం, హాజరు కానున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. స్వామి అమ్మవారికి మంత్రి చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ
* ఇవాళ్టితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ.. సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్.. 9 ఏళ్ల తెలంగాణలో అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ.. 11.30కి అసెంబ్లీకి సీఎం కేసీఆర్.. ఇవాళ సభలో లేని ఆర్టీసీ బిల్లు
* ప్రకాశం: ఇవాళ మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. రైతులను ఉద్దేశించి ప్రసంగం
* బాపట్ల: చీరాల అంబేడ్కర్ భవన్‌లో చుండూరు అమరవీరుల సంస్కరణ సభ
* కాకినాడ: నేడు అమృత్ భారత్ స్టేషన్ పనులుకు శ్రీ కారం, పర్చువల్ విధానంలో కార్యక్రమాన్నీ ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. కాకినాడ స్టేషన్‌కి 11.50 కోట్లు, తుని స్టేషన్‌కి 9.50 కోట్లు కేటాయించిన రైల్వే శాఖ
* అంబేద్కర్ కోనసీమ: ఎల్లుండి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ముమ్మిడివరం, పీ గన్నవరం నియోజకవర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో లంక గ్రామాల్లో పర్యటించనున్న సీఎం
* నెల్లూరు జిల్లా: ముత్తుకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* విశాఖ: NTR శతజయంతి వేడుకల సందర్భంగా సమాలోచన పేరుతో సవనీర్, లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం.. అతిథిగా సినీ నిర్మాత రామకృష్ణ, పలువూరు టీడీపీ మాజీమంత్రులు,ఎమ్మెల్యేలు
* విశాఖ: గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో నేడు జనసేన ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో మొక్కల పంపిణీ
* ఏలూరు: నేడు ఏలూరులో గవర్నర్ పర్యటన.. ఏలూరు రైల్వేస్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్
* గుంటూరు: నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లను అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ
* కర్నూలు: నేడు జిల్లావ్యాప్తంగా వైసీపీ నిరసనలు.. పుంగనూరు ఘటనకు నిరసనగా ఆందోళన
* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవారికి పల్లకిసేవ
* విశాఖ: ఆర్కే బీచ్‌లో హ్యాండ్‌లూమ్ శారీ వాక్.. వెయ్యి మంది మహిళలతో కలర్ ఫుల్‌గా జరిగిన చేనేత వస్త్ర ప్రదర్శన.. వాక్‌కు ముఖ్య అతిథిగా కరణం మల్లేశ్వరి, విశాఖ మేయర్ హరి వెంకట కుమారి
* తూర్పుగోదావరి: ఇవాళ రాజమండ్రిలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 70వ జయంతి వేడుకలు, పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు
* కృష్ణా: నేడు గన్నవరం మల్లవల్లిలో పవన్ పర్యటన.. ప్రభుత్వానికి భూములు ఇచ్చి పరిహారం అందని రైతులతో మాట్లాడనున్న పవన్
* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండంలో అర్చకుల ప్రత్యేక పూజలు.. వర్షాలకు ధర్మగుండంలో కొత్తనీరు రావడంతో పూజలు నిర్వహించి స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అర్చకులు

Exit mobile version