NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం

* విజయవాడ: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు.. స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతున్న సీఐడీ

* తిరుమల: నేడు నాల్గో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ.. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు కల్పవృక్ష వాహనసేవ.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ

* తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,230.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,000

* అనంతపురం : నేడు కాచిగూడ – యశ్వంతపూర్ వందేభారత్ ట్రయల్ రన్.. అనంతపురం ర్తెల్వే స్టేషన్ లో ఒక్క నిమిషం ఆగనున్న ర్తెలు.

* విశాఖ: AOBలో హై అలెర్ట్.. నేటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు.. ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో పట్టు కోసం మావోల ప్రయత్నాలు.. వారోత్సవాల నేపథ్యంలో తనిఖీలు.. భద్రత కారణాలతో
విశాఖ-కిరండోల్ రైలును ఈ నెల 28వరకు కుదించిన వాల్తేరు డివిజన్

* కర్నూలు: నేడు పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి, మద్దికేర, పత్తికొండ, లో సిపిఐ నేతల బృందం పర్యటన.. హంద్రీనీవా కాలువ ద్వారా 77 చెరువులకు నీళ్లు విడుదల అయ్యాయో లేదో పరిశీలించనున్న సిపిఐ నేతల బృందం..

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు జిల్లాలో పర్యటించనున్న జాతీయ ఎస్టీ కమిటీ సభ్యులు

* తిరుమల: రేపు శ్రీవారి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న గరుడ వాహన సేవ.. మాడవీధులలోని గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులు వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు.. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి స్వామివారి వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు.. మాడవీధులలోని 5 ప్రాంతాల వద్ద వాహనం వద్దకు భక్తులును అనుమతించేలా ఏర్పాట్లు.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లులో ద్విచక్రవాహనాల నిలిపివేత

* విజయవాడ: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు.. ఉదయం 11 గంటల తర్వాత తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. నిన్న కస్టడీ పిటిషన్ పై సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి.. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరిన సీఐడీ.. తీర్పుపై సర్వత్రా నెలకొన్న అసక్తి

* అమరావతి : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CID నమోదు చేసిన కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు.. ఇప్పటికే IRR కేసులో పిటి వారెంట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సీఐడీ, నేడు విచారణ చేయనున్న హైకోర్టు

* అమరావతి: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న అసెంబ్లీ సెషన్‌

Show comments