* విజయవాడ: నేడు వైసీపీ ప్రతినిధుల సభ.. ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభం కానున్న సభ.. 10.30 నిమిషాలకు సభ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం జగన్, హాజరు కానున్న 8,500 మంది ప్రతినిధులు.. మొదటి సారి బార్ కోడింగ్ పాస్ లను జారీ చేసిన వైసీపీ.. పాస్ లు ఉన్న వారికే అనుమతి
* నేడు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు తీర్పు
* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం
* నెల్లూరులోని జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం
* ప్రకాశం : గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతుల పాదయాత్ర ముగింపు సందర్బంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా, హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
* ప్రకాశం : ఒంగోలులో విశ్రాంత ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధిక జన ఆకాంక్ష సదస్సు కార్యక్రమం..
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* నేడు శ్రీకాకుళంలో జనసేన పార్టీ, సేవ్ శ్రీకాకుళం సంస్ద ఆధ్వర్యంలో యువగర్జన.. వలసలు ఆగాలి_ఉద్యోగాలుకావాలి నినాదంతో కార్యక్రమం.
* తూర్పుగోదావరి జిల్లా: 31వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. ఈ నెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాకాత్ కానున్న కుటుంబ సభ్యులు.. విజయవాడ నుండి నారా భువనేశ్వరీ, హైదరాబాద్ నుండి నారా బ్రాహ్మణి రాక.. సాయంత్రం 4 గంటలకు ములాకాత్
* తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,515 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,230 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు
* ఏలూరు, భీమవరం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం..
* అల్లూరి జిల్లా: నేడు పాడేరులో ఆదివాసీ రాష్ట్ర స్థాయి సదస్సు.. గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యచరణ పై నిర్ణయాలు
* నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. ఉదయం 10:15కి భూపాలపల్లి కలెక్టరేట్, రెండు పడక గదుల గృహాలు, జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరిస్తారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1:30: భూపాలపల్లి కలెక్టరేట్ వద్ద భోజనం చేస్తారు. మధ్యాహ్నం పరకాలలో మున్సిపాలిటీ, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సభలో పాల్గొంటారు
* హనుమకొండ జిల్లా: నేడు పరకాలలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపాలిటీ పరిధిలో రూ. 114 కోట్ల 65 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ ద్వారా పరకాల వ్యవసాయ మార్కెట్ చేరుకుంటారు.. అనంతరం అక్కడ నుంచి నేరుగా నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభించి, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ గృహలక్ష్మి, దళిత బందు, 2bhk లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు అందజేయనున్నారు…