Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

నేడు ఖమ్మం జిల్లాలో మాజీమంత్రి హరీశ్ రావు పర్యటన.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా సత్తుపల్లి, మధిర, పాలేరులో ప్రచారంలో పాల్గొననున్న హరీశ్ రావు..
నేడు నల్గొండలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారం
నేడు కూడా ఏపీలో అల్లర్లపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న సిట్ అధికారులు..
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్ బీకే కేంద్రాల్లో విత్తన వేరుశనగ పంపిణీ..
నేటి ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ.. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టీటీడీ..
నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు.. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష.. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష
నేడు వాయుగుండంగా బలపడే అవకాశం.. రేపు తుఫాన్ గా మారే ఛాన్స్.. తుఫాన్ గా మారితే రెమాల్ గా నామాకరణం.. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం..
నేడు మషాద్ సిటీలో రైసీ అంత్యక్రియలు..
నేడు హైదరాబాద్, రాజస్థాన్ మధ్య క్యాలిఫయర్ -2 మ్యాచ్.. రాత్రి 7. 30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం.. ఫైనల్ కు చేరనున్న క్యాలిఫయర్ -2 మ్యాచ్ లో గెలిచిన జట్టు.. ఇప్పటికే ఫైనల్ కు చేరిన కోత్ కతా నైట్ రైడర్స్ జట్టు..

Exit mobile version