Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* అమరావతి: ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన.. బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

* హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో రోడ్లపైకి చేరిన నీరు

* కాకినాడ: నేడు రామచంద్రపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు

* కడపలో జెడ్పీ, డీఆర్సీ సమావేశాల్లో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

* నేడు రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రత్యేక స్పందన కార్యక్రమం.. రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా స్పందన కార్యక్రమం.. ఎస్పీ సీహెచ్. సుధీర్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత.. తొలిసారిగా పరిపాలన, పోలీసు యంత్రాంగం కలిసి అర్జీల స్వీకరణ

* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన కార్యక్రమాలు.. ఉదయం 11:50 నిమిషాలకు రాజమండ్రిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. రాత్రి పెనుగొండ వెంకటరామాపురం గ్రామం బేతేస్త గోస్పెల్ ప్రేయర్ హౌస్ నందు జరుగు క్రైస్తవ మీటింగ్ లో పాల్గొంటారు.

* నెల్లూరు జిల్లా: కావలిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం.. పాల్గొననున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. పలువురు నేతలు..

* రేపు గోదావరి వరదలపై సమీక్ష సమావేశం.. ధవళేశ్వరం ఇరిగేషన్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం.. వరదలు సంబంధించి ముందుగా తీసుకోవాల్సిన చర్యలు, ఏటిగట్లు బలహీనత చర్చ

* నేడు బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్..

* పల్నాడు : నేడు నరసరావుపేటలోని జమీందారు ఫంక్షన్ హాల్లో టిడిపి ఆధ్వర్యంలో మినీ మహానాడు.. హాజరుకానున్న పల్నాడు జిల్లా టిడిపి నేతలు…

* నేడు గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం.. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్న అధికారులు.

* రేపు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ..

* గుంటూరు: ఈనెల 26న రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సీఎం జగన్ పర్యటన.. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం జగన్.

* తూర్పుగోదావరి జిల్లా : ఈనెల 24వ తేదీన కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పర్యటన.. రెండు కిలోమీటర్లు మేర ముఖ్యమంత్రి రోడ్డు షో.. సత్యవతి నగర్ లో సభ ఏర్పాటు.. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,539 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 39,812 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు

* తిరుపతి: ఎస్వీయూలో అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవం -2023 రాష్ట్ర స్థాయి కార్యక్రమం.. హాజరు కానున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి , రోజా

* పశ్చిమ గోదావరి: కాళ్ళ మండలం పెదఅమీరంలో టీడీపీ మినీ మహానాడు.. హాజరుకానున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు..

* తిరుమల: ఎల్లుండి ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

* ఇవాళ నల్గొండ జిల్లా గువ్వల గుట్ట తండాలో గవర్నర్ డాక్టర్ తమిళిసై పర్యటన.. అక్కడి ప్రజలతో కలిసి మాట్లాడనున్న గవర్నర్

Exit mobile version