* నేడు పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. హుగ్లీ నది కింద నిర్మించిన మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించనున్న మోడీ.. దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రోరైలు సేవలు.. రూ.120 కోట్ల వ్యయంతో సొరంగ మెట్రో రైలు మార్గం నిర్మాణం.. రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి సొరంగ మెట్రోరైలు
* నేడు విజయవాడలో జాతీయ మానవహక్కుల కమిషన్ పర్యటన.. ఉదయం 10 నుంచి కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా ఆధ్వర్యంలో విచారణ
* నేడు మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ ప్రజాదీవెన సభ.. ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం.. పాలమూరుకు వరాలు ప్రకటించనున్న రేవంత్‌రెడ్డి
* నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వెలిగొండ ప్రాజెక్టు 2 టన్నెల్స్‌ను ప్రారంభించనున్న జగన్..
* నెల్లూరు : ఉలవపాడులో కందుకూరు వైసీపీ ఇంచార్జీ బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులో క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న లోక్ సభ వైసిపి సమన్వయకర్త విజయ సాయి రెడ్డి.. అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో పాల్గొననున్న విజయ సాయి రెడ్డి.
* నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
* నేటి మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటన వివరాలు.. కశింకోటలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం.. కొత్తపల్లి సచివాలయం బిల్డింగ్ ప్రారంభోత్సవం.. జమ్మదులపాలెంలో కో ఆపరేటివ్ డిపార్టుమెంటు -బహుళ ప్రయోజన గోడౌన్.. అనకాపల్లిలోని ఏఎంసీ కాలనీ, అంబేద్కర్ స్కూల్ మరియు బాలాజిరావు పేటలో స్మార్ట్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.
* తూర్పుగోదావరి జి: నేడు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన కార్యక్రమాలు.. ఉదయం 9 గంటలకు రాజమండ్రిలోని తన స్వగృహంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్.. అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటన
* అనంతపురం : తాడిపత్రి మండలంలోని గ్రామాలలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువ చైతన్య బస్సు యాత్ర
* తిరుపతి: రేపు పద్మావతి వర్శిటి 21వ స్నాతకోత్సవం… హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
* నేడు బెజవాడ తూర్పులో నేను నా బూతు సిద్దం పేరుతో సమావేశం.. హాజరు అవుతున్న మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని, దేవినేని అవినాష్
* అనంతపురం : తాడిపత్రి లోని పురాతన ఆలయం శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలల్లో భాగంగా నేడు సింహావాహనం కార్యక్రమం.
* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండల కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణమండపం లో నియోజకవర్గంలో అంగనవాడీ వర్కర్స్ ,హెల్పర్స్,సూపర్ వైజర్స్ తో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* అనంతపురం : జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమం.. నాలుగు నియోజకవర్గాలలో నారా భువనేశ్వరి పర్యటన.
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 6వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సాయంత్రం పుష్పపల్లకిలో ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర వీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లకి పుష్పపల్లకిలో గ్రామోత్సవం
* నంద్యాల: నేటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పర్యటన వాయిదా.. నేడు ఢిల్లీకి పురంధరేశ్వరి.. జాతీయ నేతలతో సమావేశం కానున్న ఏపీ బీజేపీ చీఫ్.. బీజేపీ బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి రాజీనామాల నేపథ్యంలో పురందరేశ్వరి పర్యటన ఖరారు చేసిన అధిష్టానం
* గుంటూరు : నేడులాంలో ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ నూతన భవనం ప్రారంభం.. నూతన భవన సముదాయాలను, వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. లాం లో నీ యూనివర్సిటీ కి హాజరు కానున్న మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, విడదల రజిని తదితరులు…
* తిరుమల: రేపు వేములవాడ ఆలయానికి టిటిడి తరపున పట్టువస్ర్తాలు సమర్పణ.. ఎల్లుండి మహనంది ఆలయానికి టిటిడి తరపున పట్టు వస్ర్తాలు సమర్పణ
* ఏలూరు: నేడు దేవరపల్లి మండలం రామన్నపాలెం గ్రామం శివాలయంలో పునః ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి తానేటి వనిత.. గోపాలపురం గ్రామంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, జనరేటర్, ఎక్స్ రే యూనిట్ ను ప్రారంభిస్తారు. సాయిబాబా గుడి సమీపంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. యాదవోలు గ్రామంలో ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. జగన్నాథపురం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. కరిచర్లగూడెం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. గోపాలపురం గ్రామంలో వాలంటీర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్ల తో సమావేశం నిర్వహిస్తారు. భిమోలు గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,552 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,900 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు
* గుంటూరు: నేడు మరోసారి మిర్చి యార్డులో దిగుమతుల నిలిపివేత.. అధిక సంఖ్యలో మిర్చి వస్తున్న నేపథ్యంలో ఉన్న నిల్వలను ఎగుమతి చేసేందుకు వీలుగా , నేడు మిర్చి యార్డు లో దిగుమతుల నిలిపివేత.. గణనీయంగా వస్తున్న మిర్చి టిక్కీలని క్రమబద్ధీకరించేందుకు, గడిచిన నాలుగు వారాలుగా ప్రతి బుధవారం దిగుమతులను నిలిపివేస్తున్న మిర్చి యార్డు పాలకవర్గం.
