Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీతో ముంబై ఢీ.. రాత్రి 7.30 గంటలకు లక్నోతో తలపడనున్న రాజస్థాన్‌

* ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం.. రాహుల్‌ గాంధీ, ప్రియాంక పోటీ చేసే స్థానాలపై చర్చ.. అభ్యర్థులను ప్రకటించని స్థానాలపై ఫోకస్‌

* నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌..

* నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన..

* అమరావతి: అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించిన ఈసీ.. పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా అంగన్వాడీ లు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలు గా నియమించాలని ఆదేశాలు

* ప్రకాశం : ఒంగోలు రూరల్ మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం: దర్శిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న వైసిపి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..

* ప్రకాశం: మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పొన్న వాహనం పై మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి వారు..

* నెల్లూరు : రేపు కందుకూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. మధ్యాహ్నం మూడు గంటలకు కందుకూరు ఏరియా వైద్యశాల సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్..

* ప్రకాశం : ఈనెల 30న కొండేపి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. టంగుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్..

* నేడు కాకినాడ రూరల్, పెద్దాపురం నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

* కాకినాడ: పవన్ కల్యాణ్‌కి మద్దతుగా నేడు పిఠాపురంలో ప్రచారం చేయనున్న హీరో వరుణ్ తేజ్

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు

* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని అంబేద్కర్ నగర్లో ఇంటింట ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ

* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి

* నెల్లూరు: మనుబోలు. తోటపల్లి గూడూరు మండలాల్లోని వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి.. కొండాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి సురేష్..

నెల్లూరు: వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూర్ లో సినీనటుడు బాలకృష్ణ రోడ్ షో. అనంతరం గూడూరులో ర్యాలీ.. బహిరంగ సభ

* నెల్లూరు జిల్లా: నేడు ఆత్మకూరు.. కోవూరు నియోజకవర్గాల్లో టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు. ఆత్మకూరు పరిధిలోని నెల్లూరు పాలెం సెంటర్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.. అనంతరం కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం లో జరిగే ర్యాలీ.. బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు

* విశాఖ: ఉమ్మడి జిల్లాలో పీసీసీ చీఫ్ షర్మిళ రెండు రోజుల ఎన్నికల ప్రచారం… నేడు పాయకరావుపే ట, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు…..

* గుంటూరు: నేడు గుంటూరులో ఓటర్ అవగాహన ర్యాలీలో పాల్గొననున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఎన్టీఆర్ స్టేడియం నుండి త్రీ కే వాక్ ను ప్రారంభించనున్న ముఖేష్ కుమార్ .. అనంతరం మొదటిసారి ఓటు వేస్తున్న యువతకు ఓటు హక్కు పై అవగాహన కల్పించనున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా…

* విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో సుప్రభాత సేవ టిక్కెట్లు విక్రయాలు పునః ప్రారంభం.. వార్షిక కళ్యాణం వేడుకలు ముగియడంతో భక్తులకు అనుమతి

* నేడు తెనాలి నియోజకవర్గంలో జనసేన ఉమ్మడి అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న క్రికెటర్ అంబటి రాయుడు.. కాజీపేట, కొలకలూరు, నందివెలుగు గ్రామాల్లో, ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న అంబటి రాయుడు.

* అనంతపురం : గుంతకల్ పట్టణంలో 132 కెవి విద్యుత్ సస్ స్టేషన్ లో మరమ్మతులు, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం.

* తిరుమల: ఇవాళ జులై నెలకు సంబంధించిన శ్రీవారి సేవా కోటాను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ.. ఎల్లుండి శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను విడుదల చేయనున్న టీటీడీ

* కడప : నేటితో ముగియనున్న ఒంటిమిట్ట కోదండ రాముని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.. నేడు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పుష్పయాగం..

* జగిత్యాల: నేడు మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండల కేంద్రాల్లో పర్యటించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, అభ్యర్థి రాజేందర్..

Exit mobile version