* ఢిల్లీ: నేడు, రేపు గ్లోబల్ బౌద్ధ సమ్మిట్.. ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్న 30 దేశాలకు చెందిన 180 మంది బౌద్ధ గురువులు
* ఇవాళ సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణ.. మెజిస్ట్రేట్ కోర్టు విధించిన శిక్షపై.. స్టే విధించాలని సెషన్స్ కోర్టును ఆశ్రయించిన రాహుల్.. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించిన సూరత్ కోర్టు
* కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఈ రోజు చివరి రోజు.. నేడు అమావాస్య కావడంతో నిన్ననే భారీగా నామినేషన్లు ధాఖలు
* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో జులై నెలకు సంబంధించిన లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఉదయం 11:30 గంటలకు జులై మాసానికి సంబంధించిన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు జులై నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల..
* గుంటూరు: గుజ్జనగుండ్ల జిల్లా ఉపాధి కార్యాలయంలో నేడు జాబ్ మేళా…
* గుంటూరు: లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నేడు వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం…
* తిరుపతి: గంగాధర నెల్లూరు.. వెదురు కుప్పం మండలం నల్లవెంగనపల్లె గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* కడప : రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా..
* పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. ఉండి, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి.
* 76వ రోజుకు చేరిన టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోని పెదపెండేకల్, ఆరేకల్, నాగలాపురం, కాపటి మీదుగా ఆదోని వరకు సాగనున్నా పాదయాత్ర..
* ప్రకాశం : మార్కాపురంలో ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలు. చిన్నారులు, మహిళల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు. సాయంత్రం మార్కాపురం లో రోడ్ షో. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పర్యాటన.. కొవ్వూరు టౌన్ 18వ వార్డ్ నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వ(99వ రోజు) కార్యక్రమం.. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు 18 వార్డ్ ఎంఈవో ఆఫీస్ ( వినాయకుడి గుడి )వద్ద నుండి ప్రారంభం అవుతుంది
* విజయవాడ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనన్నున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి.
* ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు అమావాస్య సందర్భంగా స్వామి వారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.
* వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడపలో కొనసాగుతున్న సీబీఐ బృందం దర్యాప్తు.. మూడురోజులుగా కడపలో సీబీఐ అధికారులు.. నేడో, రేపో పులివెందులకు చెందిన మరి కొందరు అనుమానితులను విచారణకు పిలిచే అవకాశం.
* విజయవాడ : నేడు ఎన్ఐఎ కోర్టులో కోడి కత్తి విచారణ.. నేడు జరగనున్న ఎన్ఐఎ వేసిన ఫిటిషన్ పై వాదనలు..
* పెద్దపల్లి జిల్లా గోదావరిఖని : నేడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం.. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం సిపి రెమ రాజేశ్వరి.. క్రీడల్లో గెలుపొందిన పోలీసులకు బహుమతులు అందజేసిన ఐజి చంద్రశేఖర్ రెడ్డి.
* నేడు ఖమ్మంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న మంత్రి మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్
* విశాఖ: నేటితో ముగియనున్న స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గడువు.. ఇప్పటి వరకు నమోదు చేసుకున్న 22 సంస్థలు.. 6 విదేశీ, 16 స్వదేశీ సంస్థలు పోటీ.. గత ఐదు రోజుల్లో వచ్చిన ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులపై ఆసక్తి. సింగరేణి సహా ప్రభుత్వ రంగ సంస్థలు EOIలో భాగస్వామ్యం అయ్యాయా…? లేదా అనేది స్పష్టత వచ్చే అవకాశం..
* శ్రీకాకుళం జిల్లా ఆముదాలవసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన.. ఉదయం 10.30 గంటలకు ఆముదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సరుబుజ్జిలి మండలం విజయరామపురం సచివాలయం పరిధిలోని బప్పాడం మరియు అమృతలింగనగరం గ్రామాoలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.. సాయంత్రం 6.30 గంటలకు శ్రీకాకుళం వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో రంజాన్ సందర్భముగా ఇఫ్తార్ విందులో పాల్గొంటారు
* ఏపీ మంత్రి బూడి ముత్యాల నాయుడు పర్యటన.. చీడికాడ మండలం పెద్దగోగాడ గ్రామంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి..