Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. విభజన అంశంపై సుప్రీంలో పిటిషన్లు వేసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, కె. రఘురామకృష్ణ రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు

* ఢిల్లీ: ఈడీ కేసులో ఇవాళ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫిబ్రవరి 26న అరెస్టయిన సిసోడియా

* ఐఫోన్ల ప్రేమికులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో తన తొలి రిటైల్‌ అవుట్‌లెట్‌ ఈరోజు ముంబైలో ప్రారంభం.. రేపు ఢిల్లీలో రెండో రిటైల్‌ అవుట్‌లెట్‌ను స్టార్‌ చేయనున్న ఐఫోన్లు..

* ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై.. ఉప్పల్‌ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* పల్నాడు: చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి విడదల రజిని

* గుంటూరు: పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో రేపటినుండి మూడు రొజుల పాటు రాష్ట్ర స్ధాయి నాటికల పోటీలు..

* ప్రకాశం : యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశం, పాల్గొననున్న రీజినల్ కోఆర్డినేటర్ లు భూమన కరుణాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు..

* ప్రకాశం : యర్రగొండపాలెంలోని ఇశ్రాయిల్ పేటలో ఘర్షణల నేపథ్యంలో 144 సెక్షన్ ను కొనసాగిస్తున్న పోలీసులు..

* క‌డ‌ప: నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో చంద్రబాబు ప‌ర్యట‌న‌… న‌గ‌రంలోని బిల్టప్ వ‌ద్ద టిడిపి జోన్ 5 స‌మావేశం. సాయంత్రం పెద్ద ద‌ర్గాలో ఇఫ్తార్‌ విందు.. రాత్రికి బ‌ద్వేలులో బ‌స‌.. రేపు బ‌ద్వేలులో కార్యక‌ర్తల‌తో స‌మావేశం..

* క‌డ‌ప: ర‌వాణా శాఖ సేవ‌ల కోసం ఈ ప్రగ‌తి పోర్టల్ స్థానంలో నేటి నుంచి సార‌థి పోర్టల్‌.. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ర‌వాణా శాఖ కార్యాల‌యాల్లో అందుబాటులోకి..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మణుగూరు మండలం జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం లో జిల్లా షూటింగ్ బాల్ జట్ల ఎంపికకు పోటీలు

* 74వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పల్లెదొడ్డి, గద్దెరాల, దేవరకొండ, కుంకనూరు, అల్లారుదిన్నె మీదుగా వలగొండ వరకు సాగనున్న లోకేష్‌ పాదయాత్ర

* ఏలూరు జిల్లాలో నేడు మంత్రి జోగిరమేష్ పర్యటన.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై సమీక్ష.. ఏలూరు మండలంలో ఉన్న పోణంగి లేఔట్ ను పరిశీలించనున్నమంత్రి..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర హోం మంత్రి అధ్వర్యంలో కొవ్వూరు టౌన్ 6 వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ(97వ రోజు) కార్యక్రమం..

* కర్నూలు: నేడు గూడూరులో శ్రీ తిమ్మగురుడు స్వామి మహోత్సవాలలో పారువేట

* అనంతపురం : నగరంలో నేటి నుంచి రెండు రోజుల పాటు మాల్లాలమ్మదేవి జాతర.

* విజయవాడ : నేడు ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ లో ఉద్యోగుల ధర్నా.. హాజరుకానున్న సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు..

* నేడు కాకినాడలో ఏజెంట్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్.. హాజరుకానున్న హీరో అఖిల్ సహా మూవీ టీం

* మాడుగుల్లోని ఎం కోటపాడు గ్రామంలో నిర్వహించే శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవంలో పాల్గొననున్న మంత్రి బూడి ముత్యాల నాయుడు

* కర్నూలు: నేడు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అంత్యక్రియలు.. దేవనకొండ మండలం తెరనేకల్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు

* నంద్యాల: నేడు శ్రీశైలం రానున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు, సభ్యుడు శంకర్ నాయక్.. ఆత్మహత్య చేసుకున్న సంతోష్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న రవి బాబు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు ఏపీ జే.ఏ.సి, అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ లో భాగంగా రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ధర్నా

* పెద్దపల్లి జిల్లా: ధర్మపురి నియోజకవర్గానికి చేరిన భట్టి విక్రమార్క33 వ రోజు పాదయాత్ర.. ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామం నుండి ప్రారంభం కానున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.

* మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నేడు మాకుల్లా వెంకటేశ్వర స్వామి జాతర లో బండ్లు తిరుగుగుట ఎడ్లబండ్ల ప్రదర్శన

* హైదరాబాద్‌: నేడు ఇందిరా పార్కు లో నిరుద్యోగ సత్యాగ్రహ దీక్ష… అఖిల పక్ష నేతలకు ఆహ్వానం

Exit mobile version