* నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు ప్రారంభం.. ఆగస్టు 21 వరకు కొనసాగనున్న వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 12 నుంచి 18 వరకు సమావేశాలకు సెలవు.. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు మరో 8 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..
* నేడు ఖమ్మంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క..
* నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
* నేడు భూపాలపల్లిలో పర్యటించనున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు..
* నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రుల పర్యటన.. అచ్చంపేటలో పర్యటించనున్నన మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనునన్న మంత్రులు..
* నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపు.. జీవో 49 రద్దు చేయాలనే డిమాండ్ తో.. బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలు.. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసీ సంఘాల ధర్నా.. డిపోలోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు..
* నేడు అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన.. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించనున్న నారాయణ..
* నేడు ఏపీ లిక్కర్ కేసులో విచారణకు హాజరుకానున్న మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి..
* నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాననున్న మాజీమంత్రి విడదల రజినీ, అంబటి రాంబాబు.. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని విచారించనున్న పోలీసులు.. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారణ చేయనున్న పోలీసులు..
