*ఢిల్లీ: నేటి నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. టీఎంసీ ఎంపీ మహువాపై ఎథిక్స్ కమిటీ నివేదిక మీద రానున్న చర్చ.. సభ ముందుకు రానున్న 24 బిల్లులు.. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త బిల్లులు.. చర్చకు అవకాశం రానున్న ప్రెస్-పీరియాడికల్స్ బిల్లు.. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా అమలు చేసే బిల్లు.. పలు సమస్యలపై చర్చకు విపక్షాల డిమాండ్.. సమావేశాలపై 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం
*నేడు మిజోరం ఎన్నికల ఓట్ల లెక్కింపు.. మొత్తం 13 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు.. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం.
*హైదరాబాద్: ఇవాళ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం.. ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ భేటీ.. ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక.. పరిశీలకుడిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జ్, దీపా దాస్ మున్షి, అజయ్, మురళీధరన్
*ఇవాళ వైసీపీ సామాజిక సాధికార యాత్ర.. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జరగనున్న యాత్ర
*కార్తీక సోమవారం సందర్భంగా నేడు మహానంది క్షేత్రంలో సామూహిక రుద్రాభిషేకం, కేదారేశ్వర వ్రతం, సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ
*శ్రీశైలం కార్తీకమాసం మూడవ సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం.. గంగాధర మండపం,ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు.. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి
