1. సీఎం జగన్ అధ్యక్షతన నేడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమోషన్ బోర్డు సమావేశం. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేట. పలు పరిశ్రమల ప్రతిపాదనల పై నిర్ణయం తీసుకోనున్న ఎస్ఐపీబీ.
ఎస్ఐపీబీలో తీసుకునే నిర్ణయాలకు రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర.
2. నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. సాయంత్రం 4.47 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్ చేరుకోనున్న సీఎం జగన్. రాజ్ భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ జి. నరేందర్.
3. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,630 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,410 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,500 లుగా ఉంది.
4. నంద్యాల : శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం.
5. విజయవాడలో నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ – జనసేన నేతల కో ఆర్డినేషన్ సమావేశం. హాజరుకానున్న ఇరు పార్టీల నేతలు.
6. నేడు హజురాబాద్ ఎన్నికల శంఖారావంను ప్రారంభించనున్న హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఉదయం 8 గంటలకు జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఉ.10:00 లకు కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజల్లో పాల్గొంటారు.
7. నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. జుక్కల్, బాన్సువాడ లలో పర్యటించనున్న సీఎం.
ఎన్నికల ప్రచార బహిరంగ సభలలో పాల్గొననున్న సీఎం కేసీఆర్.
8. నేడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ లో నారాయణఖేడ్ చేరుకోనున్న సీఎం కేసీఆర్.
