Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

నేడు భుజంగరావు, తిరుపతన్న బెయిల్‌ పటిషన్లపై విచారణ. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో బెయిల్‌ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసిన భుజంరావు, తిరుపతన్న.

నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు. పోలింగ్‌ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు. అమెరికా నుంచి ఇవాళ ఉదయం 8.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72930 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.1,01,000 లుగా ఉంది.

మిజోరాం, అసోంలో రెమాల్ తుఫాన్‌ బీభత్సం. భారీవర్షాలకు మిజోరాంలో 27 మంది మృతి. మిజోరాంలో నేలకూలిన 150 ఇళ్లు. నేడు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం. భారీవర్షాలతో మిజోరాంలో విద్యాసంస్థలకు సెలవు.

దక్షిణ కేరళలో వర్ష బీభత్సం. 2 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. 3 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌. ఎర్నాకుళం, కొట్టాయంలో రెడ్‌ అలర్ట్‌. అలపుల, ఇడుక్కి, పత్తనంమిట్టలో ఆరెంజ్‌ అలర్ట్‌. 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.

ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వర రావు. నేటి నుంచి 3 రోజులు ఏసీబీ కస్టడీకి ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వర రావును విచారించనున్న ఏసీబీ అధికారులు. ఆక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ ఉమామహేశ్వర రావు.

ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని చెప్పారు.

 

Exit mobile version