Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

అమరావతి : నేడు చెన్నై లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. ఇప్పటికే చెన్నై చేరుకున్న పవన్. ఉదయం 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై సదస్సు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న పవన్ కళ్యాణ్.

అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి రానున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాల అమలు…సర్వే రిపోర్ట్ పై సమీక్ష. సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం నుంచి నేరుగా కడప వెళ్లనున్న సీఎం చంద్రబాబు.

HYD: నేడు గద్వాల నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్‌ భేటీ. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశం.

నేడు ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు. 24 గంటల్లో రాయలసీమను తాయనున్న నైరుతి రుతుపవనాలు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడే ఛాన్స్‌. తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.

విజయవాడ: APPSC అక్రమాల కేసులో పీఎస్‌ఆర్‌ రెండో రోజు విచారణ. పీఎస్‌ఆర్‌తో పాటు ఏ2 మధుసూధన్‌ను కూడా ప్రశ్నించనున్న పోలీసులు. ఇవాళ్టితో ముగియనున్న పీఎస్‌ఆర్‌, మధుసూధన్‌ల పోలీస్‌ కస్టడీ. సాయంత్రం 5 గంటలకు పీఎస్ఆర్‌, మధుసూధన్‌లను సబ్‌జైలుకు తరలింపు.

విజయవాడ: లిక్కర్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిలను వారం రోజులు, రాజ్‌ కేసిరెడ్డిని మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌. పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు.

విజయవాడ: వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ. నకిలీ ఇళ్లపట్టాల కేసులో బెయిల్‌ ఇవ్వాలని వంశీ పిటిషన్‌. నేడు వంశీ పటిషన్‌పై విచారణ చేపట్టనున్న నూజీవడు కోర్టు.

ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి బిజీ బిజీ. నేడు మరోసారి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ.

ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌ మీదుగా ఉపరితల ద్రోణి. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. గంటలకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.

కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు. త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాలు. సాయంత్రం 7గంటలకు సప్త హారతులు. ఈ రోజు చండీ హోమం నిర్వహించనున్న పూజారులు. చివరి రోజు భారీగా భక్తులు తరలివస్తారని అంచనా. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు.

నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్న భట్టి. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి బహిరంగ సభ.

Exit mobile version