Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. నిజామాబాద్‌ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు. మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం. నైరుతి ప్రభావంతో ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు.

2. నేడు అమిత్‌ షా, నడ్డాతో ఈటల, రాజగోపాల్‌ రెడ్డి భేటీ. కొత్త బాధ్యతల అప్పగింతపై చర్చించే అవకాశం.

3. నేడు ఈజిప్ట్‌కు ప్రధాని మోడీ. రెండు రోజులు పర్యటించునున్న ప్రధాని మోడీ. మోడీని ఆహ్వానించనున్న ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా. 1997 తర్వాత ఈజిప్ట్‌లో భారత ప్రధాని పర్యటన.

4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,020 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.74,000 లుగా ఉంది.

5. నేడు సెప్టెంబర్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల. రూ.300 టికెట్ల కోటాను విడుదల చేయనున్న టీటీడీ.

6. నేడు అఖిలపక్ష సమావేశానికి అమిత్‌ షా పిలుపు. మణిపూర్‌ పరిస్థితులపై అఖిలపక్షంలో చర్చ.

7. నేటి నుంచి అందుబాటులో గ్రూప్‌-4 హాల్‌ టికెట్లు. జులై 1న గ్రూప్‌-4 రాతపరీక్ష, ఏర్పా్ట్లు చేసిన టీఎస్పీఎస్సీ. జులై 1న 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్‌-1 పరీక్ష. 8,180 గ్రూప్‌-4 సర్వీసు పోస్టులకు నోటిఫికేషన్‌. దరఖాస్తు చేసుకున్న 9.51 లక్షల మంది అభ్యర్థులు.

8. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నేడు, రేపు మంత్రి సురేష్ పర్యటన. అటవీ ప్రాంతంలో పర్యటనకు ప్రత్యేక వాహనాల్లో పయనం. ఇవాళ రాత్రి నల్లమల లోనే బస చేయనున్న మంత్రి. పాలుట్ల గూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నల్లమల అటవీ ప్రాంతంలో దివంగత నేత వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి సురేష్.

9. విజయవాడలో నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉపా కేసులు రద్దుచేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం.

10. విజయవాడ ఇస్కాన్ వారి అధ్వర్యంలో నేడు బెజవాడ బందరు రోడ్డులో జగన్నాథ రథ యాత్ర.

11. నేడు 101వ రోజు భట్టి పాదయాత్ర. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కోప్పోలు గ్రామం నుండి ప్రారంభం కానున్న భట్టి పాదయాత్ర. నకిరేకల్ నియోజకవర్గం కొప్పోలు, భీమవరం, గ్రామాల అనంతరం సూర్యపేట నియోజకవర్గంలోకి బట్టి పాదయాత్ర. ఏదుల్లావారి గూడేం, కుసుమవారి గూడెం, సైనిక్ పురి కాలనీ గ్రామాల వరకు కొనసాగనున్న భట్టి పాదయాత్ర. భీమవరంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. సైనిక్ పురి కాలనీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బస.

Exit mobile version