Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు. నేడు ప్రొద్దుటూరులో రాయలసీమ జోన్‌ నేతల భేటీ.

2. కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై పొన్నం అసంతృప్తి. ఎన్నికల కమిటీలో చోటు దక్కలేదని ఆవేదన. నేడు రేవంత్‌రెడ్డిన కలవనున్న పొన్నం ప్రభాకర్‌. పొన్నంను కలిసి సంఘీభావం తెలిపిన నేతలు.

3. వీఆర్‌ఏల క్రమబద్దీకరణపై నేడు నిర్ణయం. ఇప్పటికే పలు శాఖల్లో సర్దుబాటుకు ప్రతిపాదన. ప్రభుత్వ శాఖల్లో మొదటి కేడర్‌ పే స్కేల్‌ వర్తింపు.

4. నేడు తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణం. ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్‌ అలోక్‌ ఆరాధే. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.

5. నేడు కాంగ్రెస్‌ పీఏసీ సమావేశం. కొల్లాపూర్‌ సభ, మహిళా డిక్లరేషన్‌పై ప్రధాన చర్చ. పార్టీలో చేరికలు, మేనిఫెస్టోపై చర్చించనున్న నేతలు.

6. వెస్టిండీస్‌తో ఇండియా రెండో టెస్ట్‌ మ్యాచ్‌. మూడో రోజు వెస్టిండీస్‌ స్కోర్‌ 229/5. క్రీజులో జేసన్‌ హోల్డర్‌(11), అథనేజ్‌ (37). ఇన్సింగ్స్‌లో 209 రన్స్‌ వెనుకంజలో విండీస్‌. మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం.

7. నేడు శ్రీరాముడి కాంస్య విగ్రహానికి శంకుస్థాపన. మంత్రాలయంలో 108 అడుగుల కాంస్య విగ్రహం. వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న అమిత్‌ షా.

8. నంద్యాల : నేడు శ్రీశైలం జలాశయం వద్ద గంగమ్మకు నది హారతి. జలాశయం 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు హై స్కూల్ పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో కృష్ణమ్మకు నది హారతి.

9. నేడు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం.. తమ డిమాండ్ల సాధన దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం.

10. అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు ఆత్మీయ సమావేశం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు అయిన సందర్భంగా సమావేశం అంటున్న అనుచరులు. గత ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన పిల్లి బోస్ అనుచరులు. పిల్లికి కౌంటర్ గా సమావేశం ఏర్పాటు చేశారని నియోజకవర్గంలో చర్చ.

Exit mobile version