Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు ఆన్‌లైన్లో నవంబర్‌ నెల టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఉంజల్‌సేవా, సహస్రదీపాలంకరణ టికెట్లు విడుదల. మధ్యాహ్న 3 గంటలకు వర్చువల్‌గా సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల. రేపు ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడదల.

2. నేడు హైదరాబాద్‌ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,070 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.76,500 లుగా ఉంది.

3. నేడు విశాఖకు కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్‌ సిన్హా. మధ్యాహ్నం 3గంటలకు అఖిలపక్ష కార్మిక సంఘాలతో సమావేశం అయ్యే అవకాశం. స్టీల్‌ప్లాంట్‌ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని కమిటీ నిర్ణయం.

4. కాంగ్రెస్‌ గూటికి రేఖానాయక్‌ దంపతులు. కాంగ్రెస్‌లో చేరిన రేఖానాయక్‌ భర్త అజ్మీరా శ్యామ్‌ నాయక్‌. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న రేఖానాయక్‌.

5. నేడు లేదా రేపు తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు అవకాశం. గవర్నర్‌ సమయాన్ని బట్టి మంత్రి వర్గ విసర్తణ. కేబినెట్‌లో ఉన్న ఓ ఖాళీని భర్తీ చేసే అవకాశం. మహేందర్‌ రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే చాన్స్‌.

6. నేడు గన్నవరంలో టీడీపీ బహిరంగ సభ. మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ బహిరంగ సభ ప్రారంభం. సభకు దాదాపు లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు.

7. నేడు సీపీఎం, సీపీఐ రాష్ట్రకమిటీల వేర్వేరు సమావేశాలు. మధ్యాహ్నం తర్వాత ఉమ్మడిగా భేటీకానున్న ఇరు కమిటీలు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ టికెట్లు ప్రకటించడంతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్న సీపీఐ, సీపీఎం.

8. తిరుమల : నేటి నుంచి మూడు రోజుల పాటు కారీరిష్టి యాగం. ధర్మగిరిలో మూడురోజులు వరుణజపం. ఈ నెల 26న శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

9. అల్లూరి జిల్లా పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు లోయలో నుంచి బస్సును తీయనున్న సిబ్బంది. వర్షంతో నిన్న బస్సు తీసే పనులకు అంతరాయం. పాడేరు ఆసుపత్రిలో కోలుకుంటున్న 21 మంది. ఇవాళ మరికొంత మందిని డిశ్చార్జ్‌ చేసే అవకాశం.

10. ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖపై సీఎం జగన్‌ సమీక్ష. ఏపీ ఆర్థిక పరిస్థితి, ఆదాయంపై జగన్‌ ఉన్నతస్థాయి చర్చ.

Exit mobile version