Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు గజ్వేల్‌లో బీజేపీ తెలంగాణ చీఫ్‌ పర్యటన. పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి టూర్‌.

2. నేడు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు. వర్షాల కారణంతో సెలవు ప్రకటించిన విద్యాశాఖ.

3. నేడు తిరుపతిలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటన. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవంకు హాజరుకానున్న గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌.

4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.82,000 లుగా ఉంది.

5. పార్టీ బలోపేతంపై నేడు నేతలతో కిషన్‌ రెడ్డి భేటీ. హాజరుకానున్న తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు.

6. చిత్తూరు : వెదురుకుప్పం మండలంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

7. కాకినాడ : నేడు జిల్లాకు రానున్న ఇంచార్జి మంత్రి సీదిరి అప్పలరాజు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి.

8. పల్నాడు: నాదెండ్లలో నేడు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజిని…

9. విశాఖ : నేడు 7వ విడత రోజ్ గార్ మేళా… ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి
కపిల్ మోరేశ్వర్ పాటిల్. పోర్టు కళావాణీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో నియామక పత్రాలు అందించనున్న కేంద్రమంత్రి.

Exit mobile version