Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

1. నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు. సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

2. నేటి నుంచి హైదరాబాద్‌లో సీపీఎం ప్లీనరీ సమావేశాలు. రెండు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాలు.

3. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,740 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,200 లుగా ఉంది.

4. నేడు ఆర్థికశాఖపై సీఎం జగన్‌ సమీక్ష. హాజరుకానున్న ఆర్థికశాఖ అధికారులు.

5. నేడు సచివాలయం ముట్టడికి ఏపీ కాంగ్రెస్‌ పిలుపు.

6. నేడు మూడో రోజు సమతాకుంభ్‌-2024. ముచ్చింతల్‌లో ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు. చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు.

7. నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ట. ప్రభుత్వం తరుపున స్వాగతం పలకనున్న మంత్రి సీతక్క. గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్న ఎస్పీ, కలెక్టర్‌.

8. నేడు మేడారం వెళ్లనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. మధ్యాహ్నం అమ్మవార్లను దర్శించుకోనున్న కిషన్‌ రెడ్డి. మేడారం నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు కిషన్‌ రెడ్డి. బీజేపీ సంకల్ప యాత్రలో పాల్గొననున్న కిషన్‌ రెడ్డి.

9. నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చ.

Exit mobile version