Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. కాళేశ్వరం త్రివేణిసంగమంలో వేదపండితుల ప్రత్యేకపూజలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు. ఈరోజు సాయంత్రం 5గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్‌. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్న సీఎం దంపతులు. సరస్వతి ఘాట్‌ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌.

ప్రకాశం: నేడు నాగులుప్పలపాడు (మం) అమ్మనబ్రోలులో మంత్రి నారా లోకేష్‌ పర్యటన. ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబసభ్యులను పరామర్శించనున్న నారా లోకేష్‌.

తాడేపల్లి: నేడు వైసీపీ కార్యాలయంలో పలువురు ముఖ్యనేతలతో జగన్‌ సమావేశం.

విజయవాడ: లిక్కర్‌ కేసులో ఏ30 దిలీప్‌ను కస్టడీకి ఇచ్చిన కోర్టు. ఇవాళ ఒక్కరోజు కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్న సిట్‌.

నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హెచ్చరిక. తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు వర్ష సూచన.

తిరుమల: నేటి నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించనున్న టీటీడీ. భక్తుల రద్దీ తగ్గడంతో సిఫార్సు లేఖలు స్వీకరించాలని టీటీడీ నిర్ణయం. తెలుగు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలకు అనుమతి. లేఖలపై అనుమతి పొందిన భక్తులకు రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు.

నేటి నుంచి జమ్ముకశ్మీర్‌లో స్కూళ్ల రీఓపెన్‌. కాల్పుల విరమణతో జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న సాధారణ పరిస్థితులు. సాంబా, విజయ్‌పుర, కథువా, బర్నోటి, లఖన్‌పూర్‌, రాజౌరి ప్రాంతాల్లో స్కూల్స్‌ రీఓపెన్‌.

కాకినాడ: నేడు సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం. మున్సిపాలిటీలో మొత్తం 31 కౌన్సిలర్లు, వైసీపీ తరఫున గెలిచిన 29 మంది కౌన్సిలర్లు, టిడిపికి ఇద్దరు కౌన్సిలర్లు. మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ టిడిపి తో సఖ్యతగా ఉంటున్నారని అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరిన 22 మంది వైసిపి కౌన్సిలర్లు.

చిత్తూరు : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు. పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారణ.

అమరావతి: ఐపీఎస్ పీఎస్సార్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేయనున్న హైకోర్టు. సినీ నటి జిత్వా నీ వేధింపుల కేసులో బెయిల్ ఇవ్వాలని పీఎస్సార్ పిటిషన్.

 

Exit mobile version