Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్నాంధ్ర సాకార యాత్ర. నేడు నందికొట్కూరు, కర్నూలులో బాలకృష్ణ రోడ్‌ షో, బహిరంగ సభ.

నేడు ఐపీఎల్‌లో బెంగళూరుతో తలపడనున్న హైదరాబాద్‌. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్‌.

నేడు సీఎం జగన్‌ బస్సుయాత్ర యధాతథం. ఉదయం 9గంటలకు కేసపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం. గన్నవరం, ఆత్కూర్‌, వీరపల్లి క్రాస్‌, హనుమాన్‌ జంక్షన్‌,పుట్టగుంట మీదుగా జొన్నపాడు చేరుకోనున్న బస్సు యాత్ర..

నేడు శ్రీకాకుళంలోని రాజాం, పలాసలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. మధ్యాహ్నం 3 గంటలకు రాజాంలో చంద్రబాబు బహిరంగ సభ. రాత్రి పలాసలో బస చేయనున్న చంద్రబాబు.

నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు. జూన్‌ 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.

నేడు నారాయణపేటలో కాంగ్రెస్‌ జనజాతర సభ. కాంగ్రెస్‌ జనజాతర సభకు హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 72,540 లుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,490. అలాగే కిలో వెండి ధర రూ. 89,900 లుగా ఉంది.

నేడు సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి పర్యటన. ఉదయం 8 గంటలకు హిమాయత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం. ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష. సాయంత్రం 5గంటలకు సనత్‌నగర్‌ చాచానగర్‌లో బైక్‌ ర్యాలీ.

నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కోరు మండలంలోని సాలు చింతల వద్ద ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో పాల్గొననున్న రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు…కోవూరు నియోజకవర్గ పరిశీలకులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి… నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లు.. ఉపాధ్యాయులతో జరిగే ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని కపాటి పాలెం లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న టిడిపి అభ్యర్థి నారాయణ. వింజమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఉదయగిరి టిడిపి అభ్యర్థి సురేష్.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. మర్రిపూడిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.. గిద్దలూరు నియోజకవర్గం లోని అన్నీ మండలాల్లో వైసీపీ నేతలతో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొననున్న ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంఎల్ఏ అభ్యర్ధి కేపీ నాగార్జున రెడ్డి.

 

Exit mobile version