1. నేడు సికింద్రాబాద్ లష్కర్ బోనాలు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తుల బోనాలు. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని.
2. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉచిత బస్సు సర్వీసులు. ఉదయం 9.45 గంటలకు దుర్గ ఘాట్ నుంచి బస్సులు ప్రారంభం.
3. నేటి నుంచి రెండో విడత వారాహి యాత్ర. ఏలూరు నుంచి ప్రారంభంకానున్న రెండో విడత యాత్ర. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న పవన్ కల్యాణ్.
4. నేడు బీజేపీ జాతీయ స్థాయి సమావేశం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం. హాజరుకానున్న 11 రాష్ట్రాల అధ్యక్షులు. జాతీయ కార్యవర్గ సభ్యులు. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి సోము వీర్రాజు, బండి సంజయ్‌ను తీసుకుంటూ ఆదేశాలు. మొత్తం 10మందికి జాతీయ కార్యవర్గంలో చోటు.
5. నేడు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన. పార్వతీపురం, అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
6. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,510 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లుగా ఉంది.54,550 అలాగే కిలో వెండి ధర రూ.76,700 లుగా ఉంది.
7. విశాఖ: భీమిలి తీరంలో ఒబారాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ రిసార్ట్స్. అన్నవరం దగ్గర 350కోట్ల రూపాయలు పెట్టుబడికి సిద్ధమైన ఒబారాయ్ గ్రూప్.. నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్. గ్లోబల్ ఇన్వెస్టర్లు సమ్మిట్ 2023 ఏపీ ప్రభుత్వం-ఒబారాయ్ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం.. ఒబారాయ్ గ్రూప్ రాకతో పర్యాటక అభివృద్ధిలో కీలకం అంటున్న ప్రభుత్వం..
8. నెల్లూరు జిల్లా : నేడు శ్రీహరికోటకు రానున్న ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్. చంద్రయాన్-3 ప్రయోగం పై శాస్రవేత్తలతో సమీక్ష సమావేశం. ఈ నెల 11 న జరిగే మిషన్ రెడీ నెస్ రివ్యూ సమావేశంలో పాల్గొననున్న సోమ్ నాథ్.
