నేడు అస్సాం, మణిపూర్‌లో రాహుల్ గాంధీ పర్యటన. అల్లర్లు చెలరేగిన జిరిబామ్ ప్రాంతాన్ని సందర్శించనున్న రాహుల్. సహాయక శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ.
నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విసృతస్థాయి సమావేశం. ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ తొలి సమావేశం. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన భేటీ. పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న బీజేపీ. పాల్గొననున్న కేందరమంత్రులు మురుగన్, శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సోము వీర్రాజు.
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,79లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,200 లుగా ఉంది.
నేడు రష్యా పర్యటనకు ప్రధాని మోడీ. రెండ్రోజుల పాటు రష్యాలో పర్యటించనున్న మోడీ.
నేడు సుప్రీం కోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ. సుప్రీంకోర్డు వెకేషన్ సమయంలో దాఖలైన పలు పిటిషన్లు. నీట్ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు.
నేటి నుండి ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం. స్టాక్ పాయింట్ల ద్వారా అందుబాటులో ఇసుక పంపిణీ. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు.
నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న జగన్.
నేడు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్డులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ. లిక్కర్ కేసులో గతంలోనే కవిత పాత్రపై చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ.
నేడు గాంధీభవన్‌లో వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమం. ఉదయం 11.15 గంటలకు గాంధీభవన్‌కు సీఎం రేవంత్. పాల్గొననున్న భట్టి, దీపాదాస్ మున్షి, మంత్రులు.
నేడు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్, భట్టి. సాయంత్రం మంగళగిరిలో వెస్సార్ జయంతి వేడుకలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.
నేడు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అసెంబ్లీలో హేమంత్ సర్కార్‌కు విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే కేబినెట్ విస్తరణ. ఈ నెల 4వ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్.
నేటి నుంచి యూరో ఫుట్‌బాల్ టోర్నీ సెమీస్ మ్యాచ్‌లు. నేడు తొలి సెమీస్‌లో స్పెయిన్ వర్సెస్ ఫ్రాన్స్. రేపు ఇంగ్లాండ్‌తో తలపడనున్న నెదర్లాండ్స్.
నేడు, రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.