Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు తెలంగాణకు ప్రధాని మోడీ. ఉదయం 9.25 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనున్న మోడీ. ఉదయం 10.30 గంటలకు భద్రాకాళి ఆలయాన్ని దర్శించుకోనున్న మోడీ. ఉదయం 11 గంటలకు పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు. 11.45 గంటలకు ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో మోడీ బహిరంగ సభ. మధ్యాహ్నం 12.55 గంటలకు హకీంపేటకు హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం. మధ్యాహ్నం 1.45 గంటలకు హకీంపేట నుంచి రాజస్థాన్‌ వెళ్లనున్న మోడీ.

2. నేడు వైఎస్సార్‌ జయంతి. వైఎస్‌ ఘాట్‌లో నివాళులర్పించనున్న కుటుంబ సభ్యులు. ఇడుపులపాయలోనే ఉన్న వైఎస్‌ షర్మిల, విజయలక్ష్మి. మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయకు సీఎం జగన్‌. అనంతపురంలో రైతు భరోసా నిధులు విడుదల చేసి నేరుగా ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్‌. వైఎస్‌ ఘాట్‌ దగ్గర నివాళులర్పించనున్న జగన్‌.

3. ప్రధాని మోడీ పర్యటనకు కేసీఆర్‌ దూరం. ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని. హకీంపేటలో స్వాగతం, వీడ్కోలు పలకనున్న తలసాని.

4. నేడు అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. వైఎస్సార్‌ రైతు దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌. ఖరీఫ్‌ బీమా పరిహారాన్ని అందజేయనున్న సీఎం.

5. ఉత్తర, మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఆవర్తనం. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు. వచ్చే మూడు రోజులు ఏపీలో వర్షాలు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.

6. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,070 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.75,700 లుగా ఉంది.

7. హైదరాబాద్‌కు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ జవదేకర్‌. ప్రధాని మోడీ సభకు హాజరుకానున్న జవదేకర్‌. తెలంగాణలో మూడు రోజుల పాటు జవదేకర్‌ మకాం. రేపు 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం. ఎల్లుడి కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొననున్న జవదేకర్‌.

8. విజయవాడ దుర్గమ్మకు శ్రీశైలం నుంచి ఆషాడ సారె. ఉదయం 8 గంటలకు సారె సమర్పించనున్న శ్రీశైలం దేవస్థానం.

9. నేడు గుంటూరులో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన….గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు, రైతులకు మద్దతు పలకనున్న జనసేన నాయకులు మనోహర్, తదితరులు.

10. నేడు వైఎస్‌ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 74వ జ‌యంతి వేడుకలు. సెంట్రల్ ఆఫీసులో జయంతి వేడుకలతో పాటు, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేపట్టనున్న వైసీపీ. పాల్గొననున్న సజ్జల, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు.

Exit mobile version