Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

నేడు అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభ. ఈ నెల 8న యలమంచిలి నియోజకవర్గంలో పవన్‌ పర్యటన. 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొననున్న పవన్.

నేడు కృష్ణాజిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర. పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు బహిరంగ సభలు.

నేడు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన. ఉదయం 11 గంటలకు కూటమి నేతలతో బాలకృష్ణ సమావేశం. దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న బాలకృష్ణ. సాయంత్రం 7 గంటలకు ముస్లింలకు బాలకృష్ణ ఇఫ్తార్‌ విందు.

నేడు ఐపీఎల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై వర్సెస్‌ ఢిల్లీ తలపడనుండగా.. రాత్రి 7.30 గంటలకు లక్నోతో గుజరాత్‌ ఢీకొట్టనుంది.

నేడు పదోరోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న జగన్‌ బస్సుయాత్ర. పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు జగన్‌. సాయంత్రం కొనకనమెట్ల క్రాస్‌ దగ్గర బహిరంగ సభ. అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి జగన్‌. వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేయనున్న సీఎం జగన్‌.

నెల్లూరులో వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరగనున్న న్యాయవాదుల ఆత్మీయ సదస్సులో పాల్గొననున్న వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. పొదలకూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అనంతరం ఆర్యవైశ్య ఆత్మీయ సదస్సులో పాల్గొననున్న మంత్రి. ఆత్మకూరు రూరల్ మండలం కరటంపాడులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి.

నేడు శ్రీశైలంలో రెండవరోజు ఉగాది మహోత్సవాలు. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో దర్శనమివ్వనున్న భ్రమరాంబికాదేవి. కైలాసవాహనంపై ఆశీనులై పూజలందుకోనున్న శ్రీస్వామి అమ్మవారు. రాత్రి క్షేత్రపురవీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం.

నేడు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థాయి విస్తృత సమావేశం. కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అధ్యక్షతన జరుగనున్న సమావేశం.

నేడు రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం. రాజమండ్రిలోని బిజెపి ఎన్నికల కార్యాలయంలో జరుగునున్న సమావేశం.

 

 

Exit mobile version