Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

నేడు సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం. నేడు నెల్లూరులోని ముఖ్యనేతలతో జగన్‌ సమావేశం. నెల్లూరు చింతరెడ్డిపాలెం దగ్గర సీఎం జగన్‌ బస.

తెలంగాణలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ల ముందు రైతు సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్‌ గ్యారెంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో దీక్షలు. రూ.15వేల భరోసా, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్‌. క్వింటాల్‌ వడ్లకు రూ.500 బోనస్‌, రూ.2లక్షలలోపు రైతుల బ్యాంక్‌ రుణాలు మాఫీ, కరువు పట్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌.

నేడు అమరావతిలో ఎన్డీఏ కూటమి పార్టీల పార్లమెంట్‌ స్థాయి సమన్వయ సమావేశాలు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.

నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన. ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్న కేసీఆర్‌. శభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద మిడ్‌మానేర్‌ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న కేసీఆర్‌.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,480లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 85,400 లుగా ఉంది.

నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్ట మేనిఫెస్టో విడుదల. ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్న ఖర్గే, రాహుల్‌.

ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్‌తో చైన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. ఉప్పల్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. ఏపీలో ఎండతీవ్రతతో పాటు వడగాలులు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు. నేడు 253 మండలాల్లో వడగాల్పులు. మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాలులు. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు. తెలంగాణలో పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.

 

Exit mobile version