Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.81వేలుగా ఉంది.

2. తెలంగాణలో సెప్టెంబర్‌ 15న టెట్‌. నేటి నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు. సెప్టెంబర్‌ 27న ఫలితాలు విడుదల.

3. నేడు వరంగల్‌లో గవర్నర్‌ తమిళిసై పర్యటన. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న గవర్నర్‌. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన వరంగల్‌కు గవర్నర్‌.

4. నేడు కాంగ్రెస్‌లోకి పాలమూరు జిల్లా నేతలు. కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి కృష్ణారావు. గుర్నాథ్‌ రెడ్డి, రాజేష్‌ రెడ్డి, మేఘారెడ్డి. ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్న నేతలు.

5. నేడు ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ. ఆర్డినెన్స్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందని ఆరోపణ.

6. నేడు దక్షిణాది బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు కౌంటర్‌ అటాక్‌పై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న ప్రధాని మోడీ.

7. ఉత్తరాఖండ్‌, యూపీలో ఆరెంజ్‌ అలర్ట్‌. ఉత్తరాఖండ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు. మళ్లీ వరదలు వచ్చే అవకాశముందన్న ఐఎండీ.

8. నేడు మహిళా శిశు సంక్షేమంపై ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ సమీక్ష. అంగన్‌వాడీల అభివృద్ధి, మహిళల పథకాలపై చర్చ.

9. ఏలూరు జిల్లా : నేటి నుండి 7 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో డిపార్ట్ మెంట్ పరీక్షలు. జిల్లాలో డిపార్ట్మెంటల్ పరీక్షలకు హాజరు కానున్న 181 మంది అభ్యర్ధులు. పెదపాడు మండలం వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ స్కూల్ నందు ఆన్ లైన్ ఆఫ్ లైన్ లో పరీక్షలు.

10. తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత ఉదయం 11 గంటలకు కొవ్వూరు పట్టణంలో లీటరరీ క్లబ్ లో గర్భిణీలకు మరియు బాలింతలకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

Exit mobile version