NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులతో ఇంచార్జ్‌ థాక్రే జూమ్‌ సమావేశం. తెలంగాణలో ప్రియాంక పర్యటనపై చర్చ.

2. నేడు గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ పరువునష్టం కేసు విచారణ. పరువు నష్టం కేసులో జైలు శిక్షపై స్టే కోరుతూ పిటిషన్‌. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష వేసిన ట్రయల్‌ కోర్టు. రాహుల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు.

3. ఐపీల్‌లో నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 7. 30 గంటలకు ప్రారంభం కానుంది.

4. నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పోలీస్‌ క్రీడాపోటీల ముగింపునకు హాజరుకానున్న కేటీఆర్‌.

5. నేడు మహిళల సేఫ్టీ కోసం యాప్‌ ప్రారంభం. మానసిక ఆరోగ్య సేవల కోసం హెల్ప్‌లైన్‌ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌.

6. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. నేడు మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

7. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

8. నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్యాప్ లో జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించనున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

9. ఇవ్వాళ కర్నాటక లో ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేయనున్న కాంగ్రెస్. ఉదయం 9 గంటలకు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్యల ఆధ్వర్యంలో లో మేనిఫెస్టో విడుదల. నేడు కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ, ప్రియాంక.