Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

What’s Today, Whats Today, Today Events as on September 1st 2023, Today Events,

* అమరావతి: నేడు కౌలు రైతులకు రైతు భరోసా.. రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా అందనున్న సాయం

* ప్రకాశం : పెద్దారవీడు మండలం రాజంపల్లిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..

* ప్రకాశం : ఒంగోలు సీపీఎం కార్యాలయంలో జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి, అభివృద్దికి చర్యలు ప్రకటించాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం..

* ప్రకాశం : ఒంగోలు సీపీఐ కార్యాలయంలో వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై రౌండ్ టేబుల్ సమావేశం..

* తిరుమల: టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఈవో ధర్మారెడ్డి.. బంగారు వాకిలిలో ఈవో చేత ప్రమాణస్వీకారం చేయించిన జేఈవో వీరబ్రహ్మం

* తిరుమల: ఇవాళ పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్న దేశన్ కేతాయ్, తిప్పేస్వామి

* పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

* ఏలూరు: 201వ రోజుకు చేరిన నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర.. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)
ఉదయం 8.00 – పొంగుటూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం..

* పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు.. అనుమతి లేకుండా సభలు-సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదని జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఆదేశాలు..

* నెల్లూరు: సెప్టెంబ‌ర్‌ 7న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

* నెల్లూరు జిల్లా: PSLVC-57 రాకెట్ ప్రయోగానికి ఈ రోజు ఉదయం 11.50 గంటలకు మొదలుకానున్న కౌంట్ డౌన్.. 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్‌ను ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు.. రాకెట్ ద్వారా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహం ప్రయోగం

* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆరాధనోత్సవాలలో నేడు మద్యరాధన.. స్వామి వారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, నిర్మల విసర్జన, పాలాభిషేకం, మహా పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు. శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకొనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

* నంద్యాల: నేడు శ్రీశైలం అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ, ప్రత్యేక పూజలు

* నంద్యాల: జగజ్జనని ఆలయంలో నేడు వివిధ రకాల ఆకులు, పూలతో అమ్మవారికి పూజలు

* కర్నూలు: నేడు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో సీపీఐ రామకృష్ణ బస్సుయాత్ర

* నంద్యాల: మహానంది క్షేత్రంలో కామేశ్వరీ దేవి అమ్మవారికి నేడు ప్రత్యేక అలంకరణ, సాయంత్రం పల్లకి సేవ

* అనంతపురం : గుంతకల్ రైల్వే డివిజన్ లో రైల్వే ట్రాక్ పనుల కారణంగా ఈనెల 4, 5, 9న పలు రైళ్లు రద్దు.

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు రానున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ రూరల్ అచ్చంపేట వెళ్లనున్న చంద్రబాబు.. జోన్ 2 టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్న చంద్రబాబు

* తూర్పు గోదావరి జిల్లా : నేడు  హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు. క్యాంపు కార్యాలయం కొవ్వూరులో క్రొత్తగా మంజూరైన నూతన పెన్షన్ దారులకు పెన్షన్ అందజేస్తారు. కొవ్వూరు టౌన్ 13వ, 17వ వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలోని రావిపాటి కళ్యాణమండపంలో జరుగు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.

Exit mobile version